EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. 
  • Dec 31, 2020, 18:33 PM IST

EPFO 8.5% PF interest benefits: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. 

1 /5

ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో, మిస్డ్ కాల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా PF Balance చెక్ చేసుకునే అవకాశం ఉంది. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

2 /5

దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO), కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాదారులకు నూతన సంవత్సర కానుక అందించనున్నారు. మొత్తం 8.5శాతం వడ్డీని తొలుత రెండు దఫాలుగా ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించాలని నిర్ణయించారు.

3 /5

ఏ క్షణంలోనైనా ఈపీఎఫ్ఓ(EPFO) పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. పీఎఫ్ బ్యాలెన్స్‌ను పలు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం

4 /5

తొలుత http://epfindia.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. అందులో మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఈ పాస్‌బుక్ మీద క్లిక్ చేయండి అక్కడ మీ వివరాలు నమోదు చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది మెంబర్ ఐడీ వివరాలు సబ్మిట్ చేస్తే ఈపీఎఫ్ బ్యాలెన్స్(PF Balance) వివరాలు కనిపిస్తాయి Also Read : PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు

5 /5

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఫోన్‌కు వస్తాయి. యూఏఎన్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈపీఎఫ్ వివరాలు వెంటనే మీ రిజిస్టర్ మొబైల్‌కు పంపిస్తారు. Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!