Japan Earthquake: న్యూఇయర్ రోజు జపాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake Hits Japan: న్యూఇయర్ రోజు జపాన్ ను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూమి కంపించింది. మెుత్తం మీద 21 భూప్రకంపనలు 90 నిమిషాల వ్యవధిలో చోటుచేసుకున్నాయి.
భూకంపం ధాటికి జపాన్‌లోని ఇషికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. రోడ్లన్నీ చీలిపోయాయి.
భూప్రకంపనల నేపథ్యంలో తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ సంస్థ.
5 మీటర్ల ఎత్తు వరకు సునామీ ఇషికావా ప్రిఫెక్చర్‌లోని నోటోకు చేరుకునే అవకాశం ఉందని..ప్రజలు ఎత్తైన ప్రదేశాలలో ఉండాలని సూచించింది.
2011లో సంభవించిన భూకంపం జపాన్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. మరోసారి జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హచ్చరికల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
సునామీ నేపథ్యంలో భారతీయలు కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ను రిలీజ్ చేసింది అక్కడి భారత రాయభార కార్యాలయం.