Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు..ఒక్కసారిగా పెరుగుతూ కొనుగోలు దారులను ఆలోచనలో పడేస్తున్నాయి. భవిష్యత్తులో బంగారం ధర 1లక్ష దాటడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు.
బంగారం ధర నేడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10 గ్రాములకు గానూ 79 వేల రూపాయలు దాటింది. దీంతో పసిడి ప్రియుడు గగ్గోలు పెడుతున్నారు. అక్టోబర్ 18 వ తేదీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,150 రూపాయలు తాకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,200 రూపాయలు దాటింది. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి.
ఈ నెల చివర్లో ధన త్రయోదశి పండుగ సందర్భంగా పసిడి ధరలు సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది. పసిడి ధర రూ.85 వేల పైగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. పసిడి ధరలు భారీగా పెరగడం వెనుక అమెరికాలో బంగారం ధర ఒక ఔన్సు 2700 డాలర్లు దాటింది.
ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. బంగారం ధర ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం సందర్భంగా భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వాణిజ్యం కుంటుపడుతుందని భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు తరలిస్తున్నారు.
దీనికి తోడు డాలర్ ధర కూడా పతనం అవుతున్న నేపథ్యంలో బంగారం రిజర్వు కరెన్సీగా చాలా దేశాలు స్వీకరిస్తున్నాయి. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం దేశీయంగా ఫెస్టివల్ సీజన్ అని చెప్పవచ్చు.
ధన త్రయోదశి, అలాగే దీపావళి సందర్భంగా పసిడి ధరలు భారీగా పెరుగుతాయి. ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఈ సీజన్లోనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇదిలా ఉంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు నేను హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం పొరపాటు చేసినా భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా బరువు విషయంలోనూ క్వాలిటీ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని సూచిస్తున్నారు. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో హాల్ మార్క్ బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.