4 wickets in 4 balls: క్రికెట్ చరిత్రలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు వీళ్లే..!

Double Hat Trick In Cricket: క్రికెట్‌లో హ్యాట్రిక్ తీయడమే చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇక వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు అంటే అత్యంత అరుదైన ఫీట్. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీస్తే.. డబుల్ హ్యాట్రిక్ అంటారు. క్రికెట్ చరిత్రలో అతికొద్ద మంది బౌలర్లు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. వాళ్లు ఎవరంటే..?

1 /5

ఏ ఫార్మాట్‌లో అయినా తన యార్కర్లతో భయపెట్టాడు శ్రీలంక పేసర్‌ లసిత్ మలింగ. 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్వెస్ కల్లిస్, మఖాయలను వరుసగా నాలుగు బంతుల్లో ఔట్ చేసి రికార్డు సృష్టించాడు. 

2 /5

విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ భారత్ ఏ జట్టుతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌‌లో డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, నమన్ ఓజా, యూసుఫ్ పఠాన్‌లను ఔట్ చేశాడు. 

3 /5

UCB-BCB ఎలెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అబాహానీ లిమిటెడ్‌పై టీ20 మ్యాచ్‌లో అల్-అమీమ్ హుస్సేన్ 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు.  

4 /5

ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ మార్క్ బట్‌చర్ సోదరుడు గ్యారీ బట్‌చర్ తన అద్భుతమైన బౌలింగ్‌తో డెర్బీషైర్‌పై సర్రే తరఫున డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.   

5 /5

1996లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సంజయ్ మంజ్రేకర్, విక్రమ్ రాథోర్ వికెట్లను  హాంప్‌షైర్ తరపున ఆడుతున్న కెవాన్ జేమ్స్ పడగొట్టాడు. 2014 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్‌పై సోమర్‌సెట్ బౌలర్ అల్ఫోన్సో థామస్ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.