Woman Scheme: మహిళలకు దీపావళి బంపర్‌ బొనాంజా.. ఖాతాల్లో 3000 జమా చేస్తున్న ప్రభుత్వం..

Ladki Bahin Yojana For Woman: మహిళలకు ప్రభుత్వం దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. వారి ఖాతాల్లో రూ.3 వేలు జమా చేస్తుంది. సంబంధిత అధికారులు 4, 5వ విడుత కలిపి రూ.3000 అర్హులైన మహిళల ఖాతాల్లో  దీపావళి బోనస్ జమా చేయడానికి ఇప్పటికే లిస్ట్‌ కూడా తయారు చేసింది. ఈ పథకం వివరాలు ఏంటో తెలుసుకుందాం.
 

1 /7

Ladki Bahin Yojana For Women: దీపావళి పండుగ మందు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మహిళల ఖాతాల్లో రూ.3000 వారి ఖాతాల్లో జమా చేయడానికి లబ్దిదారుల జాబితా సిద్ధం చేసింది. ఆ పథకమే లడ్‌ఖీ బెహన్‌ యోజన. ఈ పథకం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం 4,5వ విడుత డబ్బులను జమా చేయనుంది.  

2 /7

మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఉపాధి మార్గం చూపించడానికి మహా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్కీ బెహన్‌ యోజనను వారికోసం ప్రత్యేకించి ప్రారంభించింది. ఈ పథకంలో చేరడానికి 21 నుంచి 60 ఏళ్ల మహిళలు అర్హులు. లడ్‌ఖీ బెహన్‌ పథకంలో చేరడానికి కావాల్సిన ధృవపత్రాలు, అర్హత వివరాలు తెలుసుకుందాం.  

3 /7

మహా ప్రభుత్వం ప్రారంభించిన లడ్కీ బెహన్ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 1500 నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమా చేస్తోంది. దీంతో వారు ఇతరులపై ఆధారపడకుండా ఉంటారు.   

4 /7

అర్హత.. మహారాష్ట్ర మహిళ అయి ఉండాలి. శాశ్వతంగా మహారాష్ట్ర ఇంటి ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. వారి వయస్సు 21-65 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పథకంలో పెళ్లి అయినవారు, కానివారు కూడా అర్హులు, విడాకులు తీసుకున్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు. లడ్కీ బెహన్‌ పథకంలో చేరడానికి మహిళలకు బ్యాంకు ఖాతా కూడా ఉండాలి. వారి కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షలు మించకూడదు.

5 /7

కావాల్సిన పత్రాలు.. ఆధార్‌ కార్డు, ఐడెంటిటీ సర్టిఫికేట్‌, బ్యాంక్‌ ఖాతా, కుల ధృవీకరఫ పత్రాం, వయస్సు ధృవీకరణ, రేషన్‌ కార్డు,పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, డొమైసిల్‌ సర్టిఫికేట్‌, బర్త్‌ సర్టిఫికేట్‌, ఓటర్‌ ఐడీ కూడా కలిగి ఉండాలి.

6 /7

లడ్కీ బెహన్ పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం.. లడ్కీ బెహన్‌ మహారాష్ట్ర పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హోంపేజీలో లాగిన్‌ అవ్వాలి.

7 /7

కొత్త పేజీలో కొత్త ఖాతా క్రియేట్‌ చేయాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి పేరు, పాస్వర్డ్‌, అడ్రస్‌ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత సైన్‌ అప్‌ చేసుకుంటే పూర్తి అవుతుంది.