Shanidev puja 2024: చాలా మంది శనిదేవుడ్ని చూసి భయపడిపోతుంటారు . కానీ నిజానికి శనిదేవుడి అనుగ్రహిస్తే.. అలాంటివారి దేనీలో కూడా కొదువ ఉండదని పండితులు చెప్తుంటారు.
సూర్యుడు, ఛాయాదేవీల కుమారుడు శని దేవుడు, ఆయనకు అన్న యమధర్మరాజు. శనిదేవుడు ముఖ్యంగా మనం చేసిన కర్మలను బట్టి పనిష్మెంట్ ఇస్తుంటాడు. అన్ని గ్రహాలలో కూడా శని గ్రహాం ఎంతో పవర్ ఫుల్ గా చెప్తుంటారు.
శనిదేవుడు, సాడేసాతి, అర్ధాష్టమ , శని ప్రభావం అని ఎక్కువగా మనం వింటు ఉంటాం. ఈ కాలంలో ఆయన సదరు వ్యక్తి చేసుకున్న కర్మలను బట్టి తగిన ఫలితాలను ఇస్తుంటాడు. అందుకే మంచి పనులు చేయాలని పండితులు చెబుతుంటారు.
శనిదేవుడు అనుగ్రహిస్తే పేదవాడు కూడా రాజు అయిపోతాడు. ఆయన ఆగ్రహిస్తే రాజు కూడా బికారీలా అయిపోతాడు. అందుకే మంచి పనులుచేస్తు, దేవుడి అనుగ్రహం కోసం కష్టపడాలని కూడా పండితులు చెబుతుంటారు.
దీపావళి అమావాస్య నాడు జరుపుకుంటాం.అయితే.. అమావాస్య తిథి శనికి ఇష్టమైనదని చెప్తుంటారు. అందుకే దీపావళి వేళ శని భగవానుడ్ని ఈ కింది విధంగా పూజించాలని చెప్తుంటారు. శనిదేవుడి అనుగ్రహాం కోసం.. కుక్కలు, కాకులు, ఆవులకు ఏదైన తినేందుకు పెట్టాలి.
అదే విధంగా శనికి నిత్యం తైలాభిషేకం చేయాలి. హనుమంతుడు, వెంకటేశ్వర స్వామిని పూజించిన కూడా శనిదేవుడు మనల్ని అనుగ్రహిస్తాడని చెబుతుంటారు. ప్రతి శనివారం దగ్గరున్న ఆలయంకు వెళ్లాలి. అక్కడ అశ్వత్థ చెట్టు కింద దీపారాధన చేయాలి.
నల్ల చీమలకు చక్కెర లేదా బెల్లం తినేందుకు వేయాలి.పేదవాళ్లకు ఏదైన తినేందుకు ఇవ్వాలి. శని పీడతో ఇబ్బందులు పడుతున్న వారు పాత్రలో నూనె పోసి అందులో వాళ్ల ముఖం చూసుకొవాలి. ఆ తర్వాత దాన్ని పారుతున్న నీళ్లలో వేయాలి. వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోవాలి. ఇలా చేస్తే.. జాబ్ లలో ప్రమోషన్ లు, అపార ధనం మీ సొంతమౌతుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)