Genelia: జెనీలియా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఎంతటి స్టార్ హీరోయిన్ గా.. కొనసాగింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాలో చేసింది ఈ నటి. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రం.. ఈమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది అయితే ఈ సినిమా దర్శకుడు టార్చర్.. పడలేక జెనీలియా మొదటి సీనప్పుడే ఈ సినిమా.. వదిలి వెళ్ళిపోయిందట.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రం ద్వారా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ జెనీలియా. ఆ తరువాత వచ్చిన సత్యం సినిమా.. ఈమెకు మంచి విజయం అందించింది. అయితే జెనీలియా దశ మార్చిన చిత్రం మాత్రం.. బొమ్మరిల్లు.
బొమ్మరిల్లు చిత్రంలో హాసిని క్యారెక్టర్ లో అందరినీ.. తెగ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈ చిత్రం పలు భాషల్లో.. డబ్బింగ్ అయింది. ఆ డబ్బింగ్ అయిన చిత్రాలలో కూడా హాసిని క్యారెక్టర్ లో.. జెనీలియానే తీసుకున్నారు అందరూ. హాసిని అంతే జెనీలియా.. జెనీలియా అంటే హాసిని అనేలా ఆ క్యారెక్టర్ ప్రేక్షకుల మదిలో గుర్తుందిపోయింది.
అయితే అలాంటి సినిమా మొదటి రోజు షూటింగే.. జెనీలియా బయటకు వచ్చేసిందన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్.. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
అసలు విషయానికి వస్తే.. మీ సినిమాల్లో ఒక సీన్ నుంచి జెనీలియా వెళ్లిపోయిందంట కదా..అని యాంకర్.. బొమ్మరిల్లు భాస్కర్ ని..అడగగానే..”బొమ్మరిల్లు సినిమా కోసం ఫస్ట్ డే..జెనీలియా రాగానే ఒక స్క్రీన్ చెప్పి షూటింగ్ మొదలుపెట్టాం. ఆ సీన్ లో ఐస్ క్రీమ్ తింటావా, కావాలా అనే రెండు డైలాగులే ఉంటాయి. ఆ రెండు డైలాగులు కూడా క్లోజప్ షార్ట్స్. అందుకే బాగొచ్చేవరకు షూటింగ్ చేస్తూనే ఉన్నాం. కేవలం ఆ రెండు డైలాగ్స్ మాత్రమే నైట్ అంతా అయిపోయింది. చివరికి రెండు ముక్కలు డైలాగ్ చెప్పలేనా నేను. దానికోసం నైట్ అంతా నన్ను ఇంతలా షూటింగ్ చేయించారు ఎందుకు. నాకు సినిమా వద్దు ఏమొద్దు అని.. వెళ్ళిపోయింది,” అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్
అయితే ఈ షూటింగ్ జరిగేటప్పుడు అల్లు అర్జున్ అక్కడే ఉండడంతో.. వెంటనే వెనకాల వెళ్లి.. జెనీలియాని ఒప్పించాడంట. మంచి దర్శకుడు ఇలా ఒక్క షాట్ వల్ల వెళ్లిపోవద్దు.. సినిమా తప్పకుండా చేయి అని.. బన్నీ వెళ్లి చెప్పి మరి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారంట. ఇక ఇదే విషయాన్ని ఈ దర్శకుడు బయటపెట్టారు. కాగా బొమ్మరిల్లు చిత్రం వల్ల.. జెనీలియా కెరియర్ స్టార్ స్టేటస్ కి ఎదిగింది అన్న విషయం మన అందరికీ తెలిసిందే.