Dengue Mosquito: డెంగ్యూ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కివి పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ పండ్లలో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Dengue Fever Prevention: దోమల సంక్రమణ కారణంగా డెంగ్యూతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలా మందిలో ఎడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టడం డెంగ్యూ బారిన పడుతున్నారు. ఇవి సాధరణంగా పగటిపూట కుడుతూ ఉంటాయి. మానవ శరీరంలో డెంగ్యూ లక్షణాలు 4 నుంచి 15 రోజుల లోపు అభివృద్ధి చెందుతాయి. దీని కారణంగా అధిక జ్వరం ఇతర సమస్యలు వస్తున్నాయి.
డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా అధిక రక్తస్రావంతో పాటు తక్కువ రక్తపోటు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరహాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది పండ్లను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
డెంగ్యూ సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు ఫైబర్ వంటి మంచి పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ పండును ప్రతి రోజు తీసుకోవడం వల్ల డెంగ్యూ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కివిలో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి వీటిని డెంగ్యూతో బాధపడుతున్నవారు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుండా తీవ్ర జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
కివి పండ్లలో కివిలో విటమిన్ సితో పాటు ఇ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా డెంగ్యూ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కివిని అల్పాహారంలో తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.