Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?

Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను  సూచించింది.

1 /6

మనలో చాలా మంది ఈ మధ్య కాలంలో నార్మల్ వాచ్ లు కాకుండా స్మార్ట్ వాచ్ లను ఎక్కువగా వేసుకుంటున్నారు. దానిలో మన శరీరంలో కలిగే మార్పులను అది గ్రహిస్తుంది.  హార్ట్ బీట్ మొదలైన వాటిని అంచనా వేస్తుంది. అంతేకాకుండా రన్నింగ్, జాగింగ్ మన శారీరక శ్రమ, ఎంతసేపు పడుకున్నాం వంటివాటిని పక్కా చెప్పేస్తుంది.  

2 /6

ఒక వేళ ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకొవాలి. దీంతో శరీంలో ఎంత కొవ్వు ఉంటుంది. అనేక టెక్నికల్ వంటి విషయాలను స్మార్ట్ వాచ్ అంచనా వేస్తుంది. అందుకే ఎక్కువ మంది స్మార్ట్ వాచ్ పెట్టుకొవడానికి ఇంట్రెస్ట్  చూపిస్తున్నారు. ఇక యాపిల్ వాచ్ లో మరింత అడ్వాన్స్ ఫీచర్‌ లు ఉంటాయి. 

3 /6

తాజాగా, ఢిల్లీకిచెందిన స్నేహ సిన్షా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె చేతికి పెట్టుకున్న స్మార్ట్ వాచ్ సెన్సార్లు ఆమె శరీరంలో ఉన్న మార్పులను గ్రహించాయి. ఇది చూసిన సదరు మహిళ అలర్ట్ అయ్యింది. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఈక్రమంలో ఆమెకు వైద్యులు ప్రాపర్ గా చికిత్స అందించారు. 

4 /6

సదరు మహిళ.. హృదయ స్పందన రేటు 230 bpm దాటడం వల్ల వెంటనే వైద్యుడిని సందర్శించమని Apple వాచ్ స్నేహను హెచ్చరించింది. ఆమె తన ప్రాంతంలోని సమీపంలోని అత్యవసర కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు ఆమె పల్స్ రీడింగ్ ను అంచనా వేయలేకపోయారు. వెంటనే.. ఆమెకు 100 జూల్స్‌తో నేరుగా మూడు రౌండ్లు షాక్ ఇవ్వాల్సి వచ్చింది. అది విజయవంతంగా పూర్తయింది.

5 /6

ఈ క్రమంలో.. స్నేహ ఆమె పరిస్థితిని పర్యవేక్షించడానికి, వైద్యులు ఆమెను ICU లో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. దీంతో మహిళ మరుసటిరోజు ప్రాణాపాయస్థితి నుంచి బైటపడింది. ఈ క్రమంలో సదరు మహిళ చేతికి పెట్టుకున్న యాపిల్ వాచ్ అలర్ట్ చేయడం వల్ల ఆమె ఆస్పత్రికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది. 

6 /6

దీంతో సదరు మహిళ.. తన ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్ సీఈవో కుక్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సాంకేతికతను రూపొందించిందుకు థ్యాంక్స్ అంటూ ఎక్స్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. దీనిపైన టీమ్ కుక్ స్పందించి మహిళ ప్రాణాలు నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేశారు.