Childrens Day 2023 : ఈ క్యూట్ ఫోటోల్లో ఉన్న హీరోయిన్లు ఎవరు?..బుల్లితెరపై చెలరేగే బుల్లి భామలు ఎవరంటే?

Childrens Day 2023 pics బాలల దినోత్సవం సందర్భంగా హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిన్నతనంలో హీరోయిన్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ అభిమానులు సంబరపడిపోతోన్నారు.

  • Nov 14, 2022, 16:17 PM IST
1 /5

రష్మిక చిన్నతనంలో ఎంత క్యూట్‌గా ఉందో అందరికీ తెలిసిందే. గతంలో రష్మిక షేర్ చేసిన ఈ చైల్డ్ హుడ్ పిక్ అందరినీ ఫిదా చేసింది. నేడు చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా ఈ ఫోటో మళ్లీ ట్రెండ్ అవుతోంది.

2 /5

కేరళ బ్యూటీ అనుపమ ఇప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో.. చిన్నతనంలో అంతకు మించి క్యూట్‌గా ఉంది. ఈ ఫోటోనే అందుకు నిదర్శనంగా మారింది. అనుపమ చిన్నతనంలో ఇంత క్యూట్‌గా ఉందా? అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

3 /5

బిగ్ బాస్ బ్యూటీ సిరి చిన్ననాటి ఫోటోను చూసి నెటిజన్లు తెగ మురిసిపోతోన్నారు. ఇంత క్యూట్‌గా ఉందా? అంటూ సిరి ఫోటోను షేర్ చేస్తున్నారు.

4 /5

బుల్లితెరపై, సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతోంది.

5 /5

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. చిల్డ్రన్స్ డే స్పెషల్ అంటూ ఇలా ఫోటోను షేర్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. అందులో పూజా హెగ్డేను ఎవ్వరూ గుర్తించలేకపోయారు.