T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బాట్స్‌మెన్‌.. భారత్ నుంచి అతనొక్కడే..!

Most Sixes In T20 World Cup: T20 ప్రపంచ కప్ 2022 క్రికెట్ అభిమానులకు పూర్తి వినోదాన్ని పంచింది. ఫైనల్ పోరులో పాక్‌ను చిత్తుచేసి ఇంగ్లాండ్ ప్రపంచ కప్‌ను రెండోసారి ముద్దాడింది. ఈ పొట్టి ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్స్ సిక్సర్లు, ఫోర్లతో అలరించారు. ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లపై ఓ లుక్కేయండి.. 
 

  • Nov 14, 2022, 15:54 PM IST
1 /5

జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన సికిందర్.. 11 సిక్సర్లు బాదాడు.

2 /5

ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. హేల్స్  6 మ్యాచ్‌లు ఆడి.. మొత్తం 10 సిక్సర్లు కొట్టాడు. సెమీ ఫైనల్‌లో భారత్‌పైనే 7 సిక్సర్లు బాదడం విశేషం.

3 /5

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మెన్లలో శ్రీలంక ప్లేయర్ కుశాల్ మెండిస్ మూడో స్థానంలో నిలిచాడు. మెండిస్ 8 మ్యాచ్‌ల్లో 10 సిక్సర్లు కొట్టాడు. 

4 /5

ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేశాడు. స్టోయినిస్ 4 మ్యాచ్‌ల్లో 9 సిక్సర్లు బాదాడు.  

5 /5

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ 6 మ్యాచ్‌ల్లో 9 సిక్సర్లు కొట్టాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా మూడో స్థానంలో నిలిచాడు.