MS Dhoni Best Records: చెన్నైలో ఎంఎస్ ధోని మరుపురాని ఇన్నింగ్స్‌లు.. ఆ రోజు మర్చిపోలేనిది

MS Dhoni Records in Chennai: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టింది జార్ఖండ్‌లో అయినా.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియాన్ని  తన సొంత మైదానంగా భావిస్తాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు కలవరపడుతున్నారు. ఆదివారం రాత్రి చెన్నైలో మ్యాచ్‌ ముగిసిన అనంతరం అభిమానులకు టీషర్టులను గిఫ్ట్‌గా ఇస్తూ మైదానం అంతా తిరిగాడు ధోని. చెన్నైలో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. వాటిపై ఓ లుక్కేయండి.. 
 

1 /5

టెస్టుల్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు (224 పరుగులు)ను ధోని చెన్నైలోనే ఆస్ట్రేలియాపై చేశాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో ధోని ఏకైక డబుల్ సెంచరీ.   

2 /5

ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తన జట్టుకు 44 విజయాలు అందించాడు. మంగళవారం రాత్రి కేకేఆర్ చేతిలో చెన్నై ఓడిపోయింది.   

3 /5

ఐపీఎల్ 2013 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని 37 బంతుల్లో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.    

4 /5

2018లో చెన్నైలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి మరోసారి ట్రోఫీని ముద్దాడింది.  

5 /5

2019లో పిచ్‌ ఏ మాత్రం బ్యాటింగ్‌కు సహకరించకున్నా.. రాజస్థాన్ రాయల్స్‌పై ధోని 46 బంతుల్లో 75 పరుగులు చేశాడు. చెన్నైలో ఇప్పటివరకు 61 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1,444 పరుగులు చేశాడు.