Chandrababu: ఇరుకు గల్లీలో పేదోడి ఇంట్లో చంద్రబాబు ఏం చేశారో తెలుసా?

Chandrababu Special Attraction In NTR Bharosa Pension Distribution: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండో నెల పింఛన్ల పంపిణీ చేపట్టింది. స్వయంగా లబ్ధిదారు ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఏం చేశారో చూశారా?

1 /7

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ జోరుగా సాగింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కె గుండుమల గ్రామంలో జరిగిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

2 /7

Chandrababu: నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చంద్రబాబు పింఛన్‌ డబ్బులు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

3 /7

Chandrababu: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల లబ్ధిదారులందరికీ పింఛన్లు అందించాలని అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఫించన్‌ల పంపిణీకి ప్రభుత్వం రూ.2,737.41 కోట్లు విడుదల చేసింది.

4 /7

Chandrababu: మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పింఛన్ల పంపిణీలో విస్తృతంగా పాల్గొన్నారు.

5 /7

Chandrababu: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించారు.

6 /7

Chandrababu: ఎన్టీఆర్‌ భరోసా కింద వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్‌ అందుతున్న విషయం తెలిసిందే.

7 /7

Chandrababu: పింఛన్ల పంపిణీకి ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  నాయుడు శ్రీశైలంలో పర్యటించారు. భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకున్న అనంతరం శ్రీ శైలం డ్యామ్‌లో కృష్ణా నదీ జలాలకు జల హారతి ఇచ్చారు.