Medical Negligence: డాక్టర్స్ కి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం.. వర్క్ ప్లేస్ లో అలా చేస్తే ఇక జైలుకే..

Medical Negligence: కేంద్రప్రభుత్వం రోగుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే డాక్టర్లపై కఠినచర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో తాజాగా, దీనివిధివిధాలనాలు, ఎప్పటి నుంచి ఈ చట్టం అమలులోకి రానుందో పూర్తి విషయాలు వెల్లడించింది. 

1 /6

కొన్ని సందర్భాలలో డాక్టర్లు ఆస్పత్రులలో రోగులను చూడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు  మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచిస్తుంటారు. దీని కోసం గ్రామీణ ప్రాంతాలతో పాటు, అనేక ప్రాంతాలలో సర్కారు ఆస్పత్రులను ఏర్పాటు చేసి, వైద్యులను నియమిస్తుంటారు

2 /6

కానీ కొందరు వైద్యులు డబ్బుల సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ ఆస్పత్రులలో డ్యూటీలు చేయడం మానేసి, ప్రైవేటు క్లినిక్ లకు వెళ్తుంటారు. తమ డ్యూటీ సమయంలో కూడా కొందరు ఇతర ఆస్పత్రులకు వెళ్తుంటారు. ఆస్పత్రిలో రోగులు వచ్చిన కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తారు. దీంతో కొన్ని సందర్భాలలో రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా కొకొల్లలు.

3 /6

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు డబ్బులు లేక చాలా మంది గవర్నమెంట్ ఆస్పత్రులకు వెళ్తుంటారు. కానీ కొందరు ఆస్పత్రులలో.. పేదల బాధలకు సరిగ్గా స్పందించరు. మందులు ఇవ్వరు. ఆస్పత్రులలో సిస్టర్స్, నర్సులు కూడా బాధితుల గోడును పట్టనట్లు ఉంటారు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు  

4 /6

కొన్నిసార్లు డాక్టర్లు.. సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకుంటే, రోగుల ప్రాణాలు కూడా కొల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. బాధితుడు బెడ్ మీద సీరియస్ గా ఉన్న కూడా.. కొందరు డాక్టర్లు అవేంపట్టన్నట్లు ఉంటారు. దీంతో కొన్నిసార్లు రోగుల బంధువులు డాక్టర్లపై దాడులు చేసిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి.  

5 /6

తాజాగా కేంద్రం రోగులను ట్రీట్మెంట్ ఇవ్వండంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే డాక్టర్టపై చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా.. కేంద్రం.. జులై 1 నుంచి నూతన న్యాయచట్టం అమల్లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. దీని కింద రోగులను నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేసే వైద్యులకు..5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంట.

6 /6

అదే విధంగా.. భారతీయ న్యాయసంహిత- 2023 లోని 106 సెక్షన్ ప్రకారం..ఇలా రోగులను పట్టించుకోని వైద్యులకు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు, ఆర్ఎంపీలకు 2 ఏళ్ల జైలు శిక్ష, జరిమాన విధించనున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త ఆయా రాష్ట్రాలు వైద్యులకు అవగాహ కల్పించాలని కేంద్రం సూచించింది.