7 Pre Cancer Signs: జీరో స్టేజ్ కేన్సర్ అంటే ఏంటి, ప్రీ కేన్సర్ 7 లక్షణాలు ఎలా ఉంటాయి

7 Pre Cancer Signs: ఆదునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారి చికిత్స మాత్రం అందుబాటులో లేదనే చెప్పాలి. అందుకే కేన్సర్ పేరు వినగానే భయపడిపోతుంటారు. ప్రారంభదశలో గుర్తించగలిగితే కేన్సర్ చికిత్స సాధ్యమే. ఆలస్యమైతే మాత్రం మూల్యం చెల్లించుకోవల్సిందే. 

7 Pre Cancer Signs: కేన్సర్ ప్రారంభ దశను స్టేజ్ జీరో లేదా ప్రీ కేన్సర్ కండీషన్ అంటారు. అంటే శరీరంలో కేన్సర్ మొదలైనా ఇంకా పూర్తిగా వృద్ధి చెంది ఉండదు. ఈ సమయంలో కొన్ని ప్రారంభ లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాల్ని సకాలంలో గుర్తించగలిగితే చికిత్స సక్సెస్ అవుతుంది. జీరో స్టేజ్ కేన్సర్ లక్షణాలు తేలిగ్గానే ఉంటాయి కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా 7 లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు.
 

1 /7

ఇతర లక్షణాలు కొంతమందికి శరీరంలో ఒకేసారి ఏదైనా మొటిమలాంటిది మొదలై పెరుగుతూ కన్పించవచ్చు. ఈ పరిస్థితి ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదించాలి. 

2 /7

శరీరంపై ఏదైనా పుండు ఏర్పడటం శరీరంపై ఏదైనా భాగంలో అకస్మాత్తుగా పుండు ఏర్పడితే కచ్చితంగా అది కేన్సర్ లక్షణం కావచ్చని గుర్తుంచుకోండి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు

3 /7

బరువు తగ్గిపోవడం మీరు తీసుకునే డైట్ బాగానే ఉన్నా ఒక్కోసారి బరువు వేగంగా తగ్గిపోతుంటారు. ఇది కేన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు

4 /7

మలబద్ధకం కొంతమందికి తరచూ మలబద్ధకం సమస్య తలెత్తుతుంటుంది. కడుపు లేదా ప్రేవుల్లో కేన్సర్ ప్రారంభదశలో ఉందని అర్ధం.

5 /7

విరేచనాలు మీకు తరచూ విరేచనాల సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ఇది కూడా కేన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. కడుపు లేదా ప్రేవుల్లో ఏదైనా గంభీరమైన సమస్య కావచ్చు

6 /7

నాలుకపై తెల్లటి మచ్చలు నాలుకపై లేదా నోట్లో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు కన్పిస్తే కేన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. ఇవి సమయం గడిచే కొద్దీ పెరుగుతుంటాయి.

7 /7

తరచూ నోటి పూత మీకు నోటి పూత తరచూ వస్తుంటే దీర్ఘకాలం తగ్గకుండా ఉంటే అది ప్రీ కేన్సర్ స్థితి కావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.