Tulasi Plant Vastu: వాస్తు ప్రకారం తులసిమొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు. అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క పెట్టుడానికి సరైన దిశ వాస్తు ఉంది. అంతేకాదు, ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు పెట్టుకోవచ్చో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం తులసిమొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు. అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క పెట్టుడానికి సరైన దిశ వాస్తు ఉంది. అంతేకాదు, ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు పెట్టుకోవచ్చో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉంటే అది తూర్పు లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. తప్పుడు దిశ కూడా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.
తులసి మొక్కకు నీరు సాయంత్రం, ఏకాదశి ఆదివారాల్లో పెట్టకూడదు. తులసిమాతకు ఆగ్రహం వస్తుంది.
ముఖ్యంగా తులసి మొక్కను ఒక కుండీలో నాటుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో నేలపై పెంచుకోవద్దు.
జోతిష్యుల ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలను పెంచుకోవచ్చు. కానీ, వాటికీ నియమాలు ఉన్నాయి.
ఇంట్లో తులసిమొక్కల సంఖ్య బేసి సంఖ్యలో ఉండాలి. అంటే ఒకటి, మూడు, ఐదు, ఏడు. ఇంట్లో తులసిమొక్కను నాటుకోవడానికి శుభప్రదమైన రోజు గురువారం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)