Bus Falls Into Gorge near Tirupati: పెళ్లికి వెళ్తుండగా పెను ప్రమాదం.. 50 మంది ప్రయాణికులతో లోయలో పడిన పెళ్లి బస్సు

Bus falls into gorge near Tirupati: చిత్తూరు: తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న సుమారు 100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.

Bus falls into gorge near Tirupati in AP: బస్సు లోయలో పడిన ఘటనలో బస్సు డ్రైవర్, ఒక చిన్నారి సహా 10 మందికి పైగానే చనిపోయారని తెలుస్తోంది. లోయలో పూర్తిగా చీకటి అలుముకుని ఉండటంతో చీకట్లో ఏమీ కనిపించే పరిస్థితి లేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు పెళ్లి బృందం ఉన్నట్టు సమాచారం.

1 /7

Bus Falls Into Gorge near Tirupati: బస్సు లోయలో పడిన ఘటనలో బస్సు డ్రైవర్, ఒక చిన్నారి సహా 10 మందికి పైగానే చనిపోయారని తెలుస్తోంది. లోయలో పూర్తిగా చీకటి అలుముకుని ఉండటంతో చీకట్లో ఏమీ కనిపించే పరిస్థితి లేదు.

2 /7

Bus Falls Into Gorge near Tirupati: ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు పెళ్లి బృందం ఉన్నట్టు సమాచారం.

3 /7

Bus Falls Into Gorge near Tirupati: సహాయం కోసం క్షతగాత్రులు పెడుతున్న ఆర్తనాదాలతో ఘటనా స్థలం విషాదకరంగా మారింది. పెళ్లి బృందంలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం అందుతోంది.

4 /7

Bus Falls Into Gorge near Tirupati: క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. చీకటి వేళ జరిగిన ప్రమాదం కావడంతో ప్రయాణికుల క్షేమ సమాచారం ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియరావడం లేదు.

5 /7

Bus Falls Into Gorge near Tirupati: రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే కానీ మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. మరోవైపు బంధువుల రోదనలతో రుయా ఆస్పత్రి పరిసరాల్లోనూ భీకరమైన వాతావరణం నెలకొంది.

6 /7

Bus falls into gorge near Tirupati: ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చూసి తల్లడిల్లిపోతున్న మహిళ

7 /7

Bus falls into gorge near Tirupati: అదృష్టవశాత్తుగా కొద్దిపాటి గాయాలతో బయటపడి ఇంకా షాక్‌లోంచి తేరుకోని కుర్రాడు.