Telangana Government Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక ప్రభుత్వ అధికారిక సెలవు మరోటి యాడ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోజు కూడా మరో సెలవు. దీంతో వారికి ఇది భారీ గుడ్ న్యూస్ కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రోజు అధికారిక సెలవు రానుంది. ఎందకుంటే ఈ మేరకు రాష్ట్ర సెక్రటేరియట్ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తెలంగాణలో వచ్చే రాష్ట్ర పండుగ బతుకమ్మ దీన్ని పిల్లలు పెద్దాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రుల్లో ఈ పండుగ కూడా ఎంతో విశేషమైంది.
ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 ప్రారంభమైంది.ఇది 10వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే, ఈరోజు ఆప్షనల్ హాలిడే కాకుండా అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర సెక్రటేరియట్ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు సీఎంఓ శేషాద్రిని కలిసి విన్నపించింది. అక్టోబర్ 10 గురువారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే ఆరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అధికారిక సెలవు వస్తుంది. దీంతో ఉద్యోగులకు రాష్ట్ర పండుగకు కూడా అధికారిక సెలవు దినం వస్తుంది. ఇది వారికి తీపి కబురు అవుతుంది.
ఇక తెలంగాణలో ఉన్న అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2 గాంధీ జయంతి అధికారిక సెలవు దినంతోపాటు అక్టోబర్ ౩ నుంచి దసరా సెలవులు వచ్చాయి. మళ్లీ పాఠశాలలు అక్టోబర్ 15వ తేదీ తిరిగి తెరచుకుంటాయి. అంటే ఈసారి భారీగా 12 రోజులు దసరా సెలవులు పాఠశాలలకు వచ్చాయి.
ఇదిలా ఉండగా అక్టోబర్ 10 పెద్ద బతుకమ్మ, మరుసటి రోజు ఆయుధపూజ, అక్టోబర్ 12 శనివారం దసరా పండుగ. అంతేకాదు ఈ నెలలోనే చివరి రోజు అయిన అక్టోబర్ 31న దీపావళి పండుగ కూడా జరుపుకోనున్నారు. ఆ రోజు కూడా అధికారిక సెలవు దినం. ఈ నెలలో పాఠశాలలతోపాటు బ్యాంకులు కూడా కేవలం 15 రోజులు మాత్రమే పనిచేస్తాయి.