BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్.. ఐదు నెలల వ్యాలిడిటీ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్..

BSNL Long Time Validity:టెలికాం ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆకర్షణీయ రీఛార్జీ ప్లాన్‌ మీరు పొందాలనుకుంటే ఓ రీఛార్జీ ప్లాన్‌ మీకు ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ అందిస్తుంది. ఇతర టెలికాం దిగ్గజ కంపెనీల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త రీఛార్జ్‌ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ ధర కేవలం రూ.997. ఇందులో మీరు 160 రోజులపాటు ప్లాన్‌ వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే 5 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది.  

2 /5

ఈ ప్లాన్‌తోపాటు ప్రతిరోజూ మీరు 2GB డేటా, ఐదు నెలల మొత్తం 320GB పాటు అందించనుంది. అంతేకాదు ఇందులో ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం, దేశవ్యాప్తంగా ఉచిత కాలింగ్‌ పొందే అవకాశం.  

3 /5

బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సరికొత్త ప్లాన్‌లో భాగంగా మీరు కొన్ని వ్యాల్యూ యాడెడ్‌ సేవలు కూడా పొందుతారు. హార్డీ గేమ్స్, జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌ అంటే కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్టివిటీతోపాటు ఎంటర్‌టైన్మెంట్‌ను కూడా అందిస్తోంది.  

4 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ అక్టోబర్‌ 15 నుంచి  4 జీ సేవలను ప్రారంభించనుంది. 25 వేల 4జీ సైట్లను కూడా ఇన్‌స్టాల్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సర్వీస్‌ ట్రయల్‌ స్టేజీని కూడా పూర్తి చేసుకుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4 జీ సిమ్‌లను కూడా అందుబాటులో ఉంచింది.  

5 /5

మొత్తానికి ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.997 రీఛార్జీ ప్లాన్‌తో ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ, డేటా, కాలింగ్‌ సర్వీసులు కూడా పొందుతారు. భవిష్యత్తులో 5 జీ సేవలను కూడా అందించేందుకు కూడా ప్రణాళికలు వేస్తూ ఇతర టెలికాం దిగ్గజ కంపెనీలకు ఈ ప్రభుత్వ రంగ సంస్థ గట్టి పోటీనే ఇస్తోంది.