BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్ఎన్ఎల్ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ. 46 తేడా. కానీ, రెండిటిలో ఏ ప్లాన్ మీకు సరిపోతుందో తెలుసా? ఈ ప్లాన్లలో మీరు ఎన్ని ఇతర ప్రయోజనాలు కూడా అదనంగా పొందుతారో తెలుసుకుందాం.
BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్ఎన్ఎల్ ప్రాముఖ్యత రోజురోజుకు పెరిగిపోతుంది. పెరిగిన టెలికాం కంపెనీల టారీఫ్‌ల తర్వాత బీఎస్ఎన్ఎల్కు చాలామంది పోర్ట్ అయ్యారు. ప్రభుత్వరంగ ఈ బీఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్, జియో, వీఐ కంటే కూడా ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు ప్రారంభించిన నేపథ్యంలో మరింత ఆదరణ పొందుతోంది.
ఈరోజు ఆకర్షణీయమైన రెండు రీఛార్జ్ ప్లాన్లను తెలుసుకుందాం. ఈ రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్ తెలుసుకుందాం. దీంతో మీరు కూడా త్వరగా బీఎస్ఎన్ఎల్ పోర్ట్ అయిపోతారు. రూ. 107, రూ. 153 ప్లాన్ల మధ్య తేడా రూ.46. కానీ, రెండు రీఛార్జీ ప్లాన్లలో ఆకర్షణీయమైన లాభాలను పొందుతారు.
రూ. 107 ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ రూ.107 రీఛార్జ్ తక్కువ డేటా వాడేవారికి బాగుంటుంది. ముఖ్యంగా ఇది 35 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా ఇతర టెలికాం కంపెనీలు కేవలం 20-28 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఇస్తాయి. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ బదులుగా ఇందులో ఏ నెట్వర్క్ అయినా మీకు 200 కాలింగ్ నిమిషాలు మాట్లాడుకోవచ్చు.
రూ. 153 ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ రూ. 153 ప్లాన్ డేటా ఎక్కువగా వినియోగించేవారికి వర్తిస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 4 జీ స్పీడ్‌తో 26 జీబీ డేటా పొందుతారు. 26 జీబీ తర్వాత 40 కేబీపీఎస్ స్పీడ్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 రోజులు. అదనంగా ఈ ప్లాన్‌లో మీరు హార్డీ గేమ్స్, ఛాలేంజర్ అరెనా గేమ్స్, గేమాన్, ఆస్ట్రోటెల్, గేమియమ్, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్టైనమ్మెంట్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లిస్టెన్ పొడ్క్యాస్ట్ లభిస్తాయి.
రెండిటిలో ఏది బెస్ట్..? మీకు ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే రూ.107 రీఛార్జీ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. మీకు ఎక్కువ డేటాతోపాటు ఇతర ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందాలంటే రూ.153 రీఛార్జీ ప్లాన్ బెట్టర్.