Sankranti: భోగి వేడుకల్లో గులాబీ దళం.. ఆడిపాడిన కవిత, కేటీఆర్‌, హరీశ్‌ రావు

BRS Party Celebrates Sankranti In Hyderabad: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు. తొలి రోజు భోగి పండుగను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు ఒక చోట చేసుకోగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేబీఆర్‌ పార్క్‌ వద్ద సందడి చేశారు.

1 /8

తెలంగాణలో సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగిని ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. పట్టణం నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు చేరడంతో పల్లెలు ప్రజలతో కళకళలాడుతున్నాయి. 

2 /8

బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సంక్రాంతి పండుగలో భాగస్వాములయ్యారు. ఉదయం రంగవల్లులు, మధ్యాహ్నం పిండివంటలు, గాలిపటాలు ఎగురవేశారు.

3 /8

హైదరాబాద్‌లో పలుచోట్ల జరిగిన భోగి పండుగ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నాయకులు పాల్గొని సందడి చేశారు.

4 /8

గచ్చిబౌలిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి నివాసంలో భోగి వేడుకలు నిర్వహించగా పార్టీ నాయకులు హాజరయ్యారు.

5 /8

ఈ వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

6 /8

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భోగి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

7 /8

హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో కవిత పాల్గొని ఆడిపాడారు.

8 /8

హరిదాసు, గంగిరెద్దుల ఆటలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు హోరెత్తించగా.. కవిత వారిని ఉత్సాహపరిచారు.