Samantha: నాగచైతన్యకి రాఖీ కట్టేయాలనుకున్న సమంత..!

Samantha Naga Chaitanya Divorce: అక్కినేని నాగచైతన్య, సమంత విభేదాలు మరియు విడాకుల వెనుక ఉన్న నిజాలు ఇంతవరకు బయటపడలేదు. అభిమానులను కుదిపేసిన.. ఈ కథనం ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో సమంత, నాగచైతన్య గురించి ఒక కథ ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

1 /5

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏ మాయ చేశావే చిత్రం సమయంలో ప్రారంభమైన వీరి ప్రేమకథ, ఎంతో మందికి ఆదర్శమైంది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అనూహ్యంగా విడాకుల ద్వారా తమ బంధాన్ని ముగించారు.

2 /5

నాగచైతన్య, సమంత విడాకుల వెనుక కారణాలు ఇప్పటికీ స్పష్టంగా బయటపడలేదు. వారిద్దరూ తమ విడాకుల గురించి చాలా నిశ్శబ్దంగా ఉండటం, అభిమానులను అనేక అనుమానాలకు గురిచేసింది. కొన్ని నివేదికల ప్రకారం, వ్యక్తిగత విభేదాలు, జీవితశైలిలో తేడాలు ఈ నిర్ణయానికి దారితీశాయని చెబుతున్నారు.

3 /5

విడాకుల అనంతరం సమంత వివిధ సందర్భాల్లో ఇన్‌డైరెక్ట్ కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా నాగచైతన్య ఈమధ్యనే శోభిత అని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు సమంత ఇన్ డైరెక్ట్ గా నాగచైతన్య పై సెటైర్లు వేస్తూ కనిపిస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె వృధా చేసిన డబ్బులు ఏమిటి అంటే..తన ఎక్స్‌కి.. ఖరీదైన కానుకలు ఇవ్వడం అంటూ చెప్పి ఇన్ డైరెక్ట్ గా చైతన్య పై కొన్ని చుడకలు వేసింది.

4 /5

నాగచైతన్య మాత్రం వీరి బ్రేకప్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ, ఒక పాత వీడియోలో సమంత తనను బెదిరించిందని పేర్కొన్నారు. లవ్ మ్యాటర్ గురించి తన తల్లిదండ్రులకు చెప్పకుంటే రాఖీ కట్టేస్తానని ఆమె చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు ఈ హీరో.

5 /5

విడాకుల తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నారు. వీరి కొత్త జీవితం గురించి వార్తలు వస్తున్నప్పటికీ, సమంత - నాగచైతన్య బ్రేకప్ గురించి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక విడాకుల తరువాత.. అక్కినేని కుటుంబంపై వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఈ విషయంలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. సమంతకు ఇండస్ట్రీ మొత్తం మద్దతు తెలిపింది, అయితే ఈ వివాదాలు నాగచైతన్య కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.