Gachibowli Flyover Shut: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్ చేసింది ది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ముఖ్యంగా గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులు ఈ విషయం ముందుగా తెలుసుకోండి. నిత్యం ట్రాఫిక్ ఉండే గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్‌ను సోమవారం 12వ తేదీ వరకు మూసివేయనున్నారు.
గురువారం నుంచి జీహెచ్‌ఎంసీ పనుల నేపథ్యంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అయితే, కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు ఫ్లైఓవర్‌ను మూసివేయనున్నారు. ఎస్‌ఆర్‌డీపీ శిల్పా లేఅవుట్ ఫేస్ 2 గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మాణ పనుల నేపథ్యంలో మూసి ఉంచనున్నారు.
అందుకే ఈ సమయంలో గచ్చిబౌలి గుండా వెళ్తున్న వాహనారులు ఆ మార్గం వెళ్లకుండా మళ్లింపులు చేపట్టాలి. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్. బైపాస్, బ్రిడ్జి గుండా బిచ్చారెడ్డి స్వీట్స్(టెలికాం నగర్) నుంచి గచ్చిబౌలి జంక్షన్ నుంచి వెళ్లాలి.
మరో మార్గం ఐఐఐటీ హైదరాబాద్ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ బైపాస్ బ్రిడ్జి గుండా గచ్చిబౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి తమకు సహకరించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు.
ఈ ట్రాఫిక్ ఆంక్షలు మొత్తంగా ఐదు రోజులపాటు ఉండనుంది. గురువారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం 12వ తేదీ రాత్రి 11 వరకు ఉంటుంది. ఈ సమయంలో వాహనదారులు గచ్చిబౌలి ఫ్లైఓవర్ వైపుగా వెళ్లకుండా ఉండాలని చెప్పారు.
అంతేకాదు వాహనదారులకు కూడా సరైన సమాచారం అందించాలని ట్రాఫిక్ పోలీసులను జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆదేశించారు. అంతేకాదు వాహనదారులు కూడా ఈ సమయంలో ఇటువైపుగా రాకుండా ఇబ్బందులు పడకూడదని కోరారు.