Samyuktha Menon Photos: భీమ్లానాయక్ హీరోయిన్ ఎంత అందంగా ఉందో చూడండి!

Samyuktha Menon Photos: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని హీరోయిన్ సంయుక్త మేనన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోలు ఏవో మీరే చూసేయండి. 
 

  • Feb 23, 2022, 13:04 PM IST

  

1 /4

సంయుక్త మేనన్​.. 1995 సెప్టెంబరు 11న కేరళలోని పాలక్కడ్ జిల్లాలో జన్మించింది. 'పాప్​కార్న్​' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్​గా వెండితెరకు పరిచయమైంది.   

2 /4

ఆ తర్వాత 'కలారి' అనే చిత్రంతో తమిళం ప్రేక్షకులకు మెప్పించింది. 'జెంగా' అనే మలయాళ షార్ట్​ఫిల్మ్​లోనూ నటించింది.  

3 /4

ఆ తర్వాత 'గాలిపట' అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం.. 'ఎరిడ', 'కదువ' అనే మలయాళ చిత్రాలతో పాటు 'గాలిపట'(కన్నడ) షూటింగ్​లతో బిజీగా ఉంది.  

4 /4

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లానాయక్' చిత్రంతో సంయుక్త మేనన్.. తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది.