Bhagyashri Borse: తెలుగు హీరోల చూపు భాగ్యశ్రీ బోర్సే వైపు.. Mr. బచ్చన్ ఫ్లాప్ అయినా అమ్మడికి మంచి డిమాండ్ ..


Bhagyashri Borse: టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో  రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడతో అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్టైయింది.  కానీ రిలీజ్ తర్వాత ఈ భామకు టాప్ స్టార్స్ నుంచి  ఆఫర్స్ క్యూ కడుతున్నట్టు సమాచారం.

 

1 /8

‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో భాగ్యశ్రీ గ్లామర్ కు ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. ఇందులో క్యూట్ క్యూట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా డిజాస్టార్ అయిన భాగ్యశ్రీకి  వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

2 /8

తెలుగులో బడా హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు తన నెక్ట్స్ సినిమాల్లో భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం రష్మిక మందన్న ఆల్రెడీ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో రెండో కథానాయిక  క్యారెక్టర్  కోసం భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.

3 /8

భాగ్యశ్రీ బోర్సే స్వస్థలం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్. యాక్ట్రెస్ కాకముందు  పలు కంపెనీలకు  మోడల్ గా  పని చేసింది. నటిగా ఫస్ట్ మూవీనే రవితేజ వంటి సీనియర్ హీరో సరసన లభించడం మాములు విషయం కాదు. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో రవితేజతో భాగ్యశ్రీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్  ఫిదా అయ్యారు.

4 /8

మాస్ మహారాజ్ కూడా ఈ చిత్రంలోని  పాటల్లో భాగ్యశ్రీని  టచ్ చేయకూడని అందాలను సైతం  టచ్ చేయడంపై పెద్ద దుమారమే రేగినా.. ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది. రవితేజ మాత్రం విమర్శల పాలయ్యారు. 

5 /8

అంతేకాదు ఈ మధ్యకాలంలో ముంబై నుంచి వచ్చిన భామకు  వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పడం షరా మాములే. హీరోయిన్స్ గా ఏళ్లకు ఏళ్లు ఏలుతున్న వాళ్ల పాత్రలకు వాళ్లు డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలు లేవు. 

6 /8

కానీ భాగ్యశ్రీ బోర్స్ తొలి సినిమా కోసమే పట్టుబట్టి.. తెలుగు నేర్చుకొని..  తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ రేంజ్ లో ముంబై భామ ఫస్ట్ మూవీతోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం వంటివి చూస్తే నటిగా ఆమె తపన ఏంటో చూపిస్తుంది.

7 /8

బహుశా తెలుగులో విజయశాంతి సహా  ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఏ పెద్ద కథానాయికలు ఎవరు కూడా ఇలా ఫస్ట్ సినిమాతోనే తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలు లేవు.

8 /8

మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్. కానీ హరీష్ శంకర్ ఈ సినిమాను పూర్తిగా మార్పుల చేర్పులతో ఈ సినిమాను తెరకెక్కించాడు.కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యారు.