Exercises for Weight Loss: బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం నెలరోజుల్లో తగ్గించే 5 వ్యాయామ పద్ధతులు

శరీరంలోపేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు స్థూలకాయం నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు. అయితే ఈ 5 వ్యాయామ పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే అద్బుతమైన ఫలితాలు కన్పిస్తాయి. కేవలం నెలరోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించి అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

Exercises for Weight Loss: శరీరంలోపేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు స్థూలకాయం నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు. అయితే ఈ 5 వ్యాయామ పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే అద్బుతమైన ఫలితాలు కన్పిస్తాయి. కేవలం నెలరోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించి అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

1 /5

ప్లాంక్ గోడ ముందు నిలుచుని ఎడమ చేతి మోచేయిని గోడకు నిటారుగా ఆన్చి మీరు ఏటవాలుగా ఉండేట్టు నిలుచోవాలి. ఇలా పొజీషన్ మార్చుతూ చేయాలి.

2 /5

లాంజెస్ గోడ ముందు నిలుచుని ఓ కాలిని ముందుకు పెట్టాలి. మరో కాలి మోకాలుపై కూర్చోవాలి. రెండో కాలు పైకి ఉండాలి. తరువాత కాలు పొజీషన్ అటూ ఇటూ మార్చాలి. ఇలా 10 సార్లు చేయాలి.

3 /5

పుష్ అప్స్ గోడకు కొద్దిగా దూరంలో అబిముఖంగా నిలుచుని చేతుల్ని గోడకు ఆన్చాలి. నెమ్మది నెమ్మదిగా ఏటవాలు పొజీషన్‌లో పుష్ అప్స్ తీయాలి. ఇలా 10-15 సార్లు చేయాలి

4 /5

మౌంటెన్ క్లైంబర్ గోడకు అభిముఖంగా నిలుచిని చేతులు గోడకు ఆన్చాలి. మీ శరీరాన్ని నిటారుగా ఉంచాలి. కడుపు లోపలకు లాగాలి. ఓ మోకాలుని ఛాతీ వరకూ లాగాలి. తరువాత రెండో కాలిని ఇలా చేయాలి. ఇలా ప్రతి సెట్ 30 సెకన్ల పాటు 10-15 సెట్స్ చేయాలి,.

5 /5

స్కార్టస్ గోడ ముందు నిలుచుని మీ భుజాల వెడల్పులో కాళ్లను చాచి పెట్టుకోవాలి. ఇప్పుడు గోడ కుర్చీ వేసినట్టు కూర్చోవాలి. తిరిగి నిటారుగా నిలుచోవాలి. ఇలా  15 సార్లు చేయాలి.