Deewali Pooja: దీపావళికి ముందే ఇంట్లో ఈ దిక్కున శంఖాన్ని ఉంచి పూజించండి.. ధనలక్ష్మి మీ ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టదు..

Deewali Pooja:  శంఖాన్ని ఉంచే దిశ: క్షీర సాగర  మథనం నుండి బయటకు వచ్చిన రత్నాలలో శంఖం ఒకటి. అప్పట్లో క్షీర సాగరం నుండి హాలాహలం నుండి అమృతం వరకు ఎన్నో వస్తువులు వచ్చాయి.  ఇక  అమ్మలకన్న అమ్మ మహా లక్ష్మి దేవికి శంఖం అంటే ప్రీతి పాత్రమైనది. అందుకే శంఖాన్ని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి అపార కరుణ కటాక్షాలుంటాయని చెబుతారు. ఇక ఇంట్లో ఏ దిక్కున శంఖం పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతారో మీరు తెలుసుకోండి..

1 /7

శంఖం ప్రతి దేవతా మూర్తి దగ్గర తప్పనిసరిగా ఉండేది శంఖమనే చెప్పాలి. శంఖంలో పోస్తే కానీ.. తీర్ధం కాన్నట్టు.. ఇంట్లో శంఖాన్ని పూజించడం వలన  ఎన్నో సానుకూల ఫలితాలుంటాయి.  అంతేకాదుశ్రేయస్సు లభిస్తుంది. అదృష్టం మీకు అడుగడుగునా అండగా ఉంటుందనే చెప్పాలి. శంఖ పూజ వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే శంఖు చక్రాలను ఉంచే నియమాలను పాటించడం చాలా ముఖ్యమైనవి.

2 /7

శంఖాన్ని ఇంటికి తూర్పు దిశలో ఉంచి పూజించాలి. పూజ గదిలో శంఖాన్ని ఉంచడం అత్యుత్తమైనది. వాస్తు ప్రకారం, పూజ గది ఈశాన్య మూలలో ఉండాలి. ఇది కాకుండా, శంఖాన్ని వాయువ్య దిశలో కూడా ఉంచి పూజించవచ్చు.  శంఖాన్ని ఈ దిశలలో మాత్రమే ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీపై అపార కరుణ, కటాక్షాలను చూపిస్తుంది.

3 /7

శంఖాన్ని ఉంచే స్థలం పరి శుభ్రంగా ఉండాలి. నేలపై ఎపుడు ఉంచకూడదు. శుభ్రమైన ఎరుపు లేదా పసుపు గుడ్డను తీసుకుని, ఆపై శంఖాన్ని దానిపై ఉంచి పూజిస్తే ఉత్తమం. పూజా అనంతరం శంఖంపై దుమ్ము ధూళి చేరకుండా ఎరుపు లేదా పసుపు వస్త్రంతో కప్పడం శ్రేయస్కరం.

4 /7

మీరు శంఖాన్ని ఊదినట్లయితే, శంఖాన్ని ఊదిన తర్వాత శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంచాలి. శంఖం ఊదిన తర్వాత ఒక గిన్నెలో నీరు, గంగాజలం తీసుకుని అందులో శంఖాన్ని వేసి ఎండబెట్టి ఆలయంలో ఉంచాలి.

5 /7

శంఖాన్ని ఎప్పుడూ పైకి చూసేలా ఉంచి పూజించాలి. దీని కారణంగా, శంఖం నుండి వెలువడే సానుకూల శక్తి ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. శంఖాన్ని శ్రీమహావిష్ణువు, లక్ష్మి దేవి దగ్గర ఉంచినట్లయితే, దాని నుండి లభించే సానుకూల ప్రభావం మరింత పెరుగుతుంది.  

6 /7

ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే పూజ అనంతరం శంఖంలో గంగాజలాన్ని నింపి ఇంటింటా చల్లాలి. ఈ సమయంలో.. మీరు ధన ధాన్యాలతో తుల తూగేలా చేయమని లక్ష్మీ దేవిని ప్రార్థించండి. శంఖాన్ని ఇలా పూజించడం వలన ఇంట్లోకి డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది.  అప్పుల బాధలు తీరుతాయి. పేదరికం దూరమయ్యే అవకాశాలున్నాయి.

7 /7

ఎలాంటి  కారణం లేకుండా శంఖాన్ని ఊదకండి. శంఖం ఊదడం ప్రాక్టీస్ చేయాలనుకున్నపుడు, పూజకు ముందు, తర్వాత మాత్రమే శంఖం ఊదడం ఆచరించాలి. పూజ లేకుండా శంఖాన్ని ఊదడం వల్ల లక్ష్మీదేవికి శాపానికి గురి కావాల్సి  వస్తుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తత అవసరం.