Samantha Daily Routine : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగు , తమిళ్ చిత్రాలతో మరింత ఇమేజ్ దక్కించుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది..
సమంత ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.. త్వరలోనే అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలోనే సమంతకు సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది.
సమంత దినచర్య ఏంటి..? ఆమె ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు.. నిద్రించే వరకు ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఉదయం 6:30 గంటలకు నిద్రలేచి సూర్యుడు నుంచి విటమిన్ డి పొందుతుందట.
ఆ తర్వాత ఉదయం 7 గంటలకు జిమ్ కు వెళ్తుందట. ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చి స్నానమాచరించి దేవుడికి దీపం పెడుతుందట.
ఆ తర్వాత 8:30గంటలకు బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని , 9:00 గంటలకు షూటింగ్ స్పాట్ కి వెళుతుందట.
అక్కడికి వెళ్లిన తర్వాత ముఖానికి ఐస్ క్యూబ్స్ తెరపి చేసుకొని, ఆ తర్వాత మేకప్ వేసుకొని షూటింగ్ లో పాల్గొంటుందని సమాచారం. ఇక సాయంత్రం 6:00 గంటలకు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత.. రెడ్ లైట్ కింద బాడీ థెరపీ చేయించుకుంటుందట.
రాత్రి 7 గంటలకు టెన్నిస్ ఆడి.. ఆ తర్వాత డిన్నర్ చేసి 9:30 గంటలకు యోగా చేసి, 10:00 గంటలకు పడుకుంటుందట.