Main Door Vastu: ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఏమవుతుంది? మరుసటిరోజే ఫలితం చూడండి..

Salt to Main Door Vastu:ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఆ ఇల్లు సుఖఃసంతోషాలతో వెల్లివిరిస్తుందని మనందరికీ తెలుసు. అయితే,  వాస్తు ప్రకారం మెయిన్ డోర్ కు ఉప్పు కడితే ఏం జరుగుతుంది?
 

Salt to Main Door Vastu:ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఆ ఇల్లు సుఖఃసంతోషాలతో వెల్లివిరిస్తుందని మనందరికీ తెలుసు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టడమే కాకుండా కొన్ని నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి. 
 

1 /5

వాస్తు ప్రకారం ఉప్పుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉప్పును ఇంటిని తుడిచే నీటిలో వేసి ఇంటిని తుడుస్తాం. దీంతో ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఈ నియమం మన పూర్వీకుల కాలం నుంచి అనుసరిస్తున్నాం.  

2 /5

అలాగే ఇంటికి ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. బాత్రూమ్‌ నిర్మాణం కూడా వాస్తు ప్రకారం జరగకపోతే బాత్రూమ్‌లో ఒక గాజు బౌల్‌లో ఉప్పు వేసి పెట్టాలి. దీంతో వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు.  

3 /5

వాస్తు ప్రకారం ఇంటి ప్రధానద్వారానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ఉప్పును ప్రధానద్వారానికి కడితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంటి ప్రధానద్వారానికి ఇలా ఉప్పు కట్టడం వల్ల వైవాహిక సమస్యలు కూడా తొలగిపోతాయి.   

4 /5

ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే జాతకంలో శుక్రదోషాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడతారు. అటువంటి అద్భుతశక్తి ఉప్పుకు ఉంటుంది. అయితే, ప్రధాన ద్వారాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.  

5 /5

ఉప్పును ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఆ ఇంట్లో ఏళ్లుగా అప్పులతో పీడించబడితే ధనసమస్యలు తొలగిపోతాయి. ఆ ఇంట్లో పేదరికం తొలగి సుకఃసంతోషాలు విరాజిల్లుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)