Arogya Shree Services Stopped In AP: ఏపీ వాసులకు బ్యాడ్ న్యూస్. నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా ఆదాయం తక్కువ ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో నాటి వైఎస్సార్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ (Arogya Shree) పథకాన్ని ప్రారంభించారు.
రూ.5 లక్షలలోపు ఆదాయం ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. అయితే, బకాయిలు పెరిగిపోవడంతో ఇకపై ఆరోగ్య శ్రీ ఉచిత వైద్యం అందించే అవకాశం లేదని ఇప్పటి మల్లీ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆగష్టు 15వ తేదీ నుంచి తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు వెల్లడించాయి. 2023 తర్వాత ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ ఉచిత సేవలకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదు.
దివంగత వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవలు.. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరీ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సందర్భంగా ప్రభుత్వమే ఆ ఆస్పత్రులకు డబ్బులు చెల్లిస్తున్నాయి.
అయితే, పెండింగ్ బిల్లుల్లు చెల్లించిన తర్వాతే సేవలు యథావిథిగా కొనసాగిస్తామని ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. కానీ, ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రూ.160 కోట్ల వరకు చెల్లించింది. అయితే, బకాయి పడిన పూర్తి డబ్బులు చెల్లిస్తేనే మళ్లీ సేవలు ప్రారంభిస్తామని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ 15 రోజుల కిందటే తాము ఆగష్టు 15 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు.