Ar rahman alimony to her ex wife: ఏఆర్ రెహమాన్ సతీమణి తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలో ప్రస్తుతం ఏ ఆర్ రెహమాన్ తన మాజీ భార్య సైరా భానుకు భరణంగా ఎంతిస్తారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఫెమస్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని మరోవైపు ఆయన అభిమానుల్ని సైతం తీవ్ర మనస్తాపానికి గురిచేస్తుందని చెప్పుకొవచ్చు. ఇప్పటికి కూడా చాలా మంది షాక్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
ఏఆర్ రెహమాన్ సతీమణి సైరాభాను.. తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె తరపు లాయర్ లో నవంబర్ 19న వందనా షా అధికారికంగా ప్రకటించారు.
దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఈ ఘటన దుమారంగా మారింది. ఇటీవల సెలబ్రీటీలు ఎక్కువగా డైవర్స్ తీసుకుంటూ వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి ఘటన చూసి చాలా మంది టెన్షన్ గా ఫీలయ్యారంట.
సైరా భాను , ఏఆర్ రెహమాన్ 1995 లో పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో దాదాపు.. 29 ఏళ్లపాటు వీరు కలిసి ఉన్నట్లు తెలుస్తొంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఏమైందో కానీ ఒక్కసారి డైవర్స్ అనౌన్స్ చేశారు.
ఏఆర్ రెహమాన్ ఇలాంటి కష్టసమయంలో తమను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు పోస్టులు పెట్టారు. వీరి సంతానం కూడా తల్లిదండ్రుల డైవర్స్ పై గోప్యతను గౌరవిస్తారని, తమను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టారు.
ఏఆర్ రెహామాన్ తో విడాకుల తర్వాత ఆమెకు ఎంత ఆస్తులు వస్తాయో అని ప్రస్తుతం నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు విజేత.. రెహామాన్ కు దాదాపు.. 2 వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయంట. ఈ లెక్కన దీనిలో సగం వరకు అంటే.. వెయ్యికోట్ల వరకు సైరాబానుకు ఇవ్వాల్సి ఉంటుందని ఆమె తరపు లాయర్ లు చెప్పారంట.
అయితే.. ఏఆర్ రెహమాన్ తన దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న బాసిస్ట్ సింగర్ మోహినీ డేతో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే ఆమె కూడా .. తన భర్తతో విడాకులు తీసుకుందని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.