Liquor Sales: ఓర్నీ ఇదేం తాగుడు భయ్యా.. సంక్రాంతి మూడు రోజుల్లో ఎన్ని కోట్ల లిక్కర్ తాగేశారో తెలుసా..?

Liquor sales in andhra pradesh: సంక్రాంతి పండగ వేళ ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. దీంతో లిక్కర్ అమ్మకాలతో సర్కారు ఖాజానాకు భారీగా ఆదాయం సమకూరింది.
 

1 /6

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు సంక్రాంతిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. దీన్ని పెద్ద పండుగలా చెప్తుంటారు. భోగి, సంక్రాంతి, కనుమను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు.  ప్రజలు ఎక్కడున్న కూడా.. ఈ పండక్కి తమ సొంతూళ్లలో వాలిపోతుంటారు.  

2 /6

తమ కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. అయితే.. ప్రస్తుతం చాలా మంది ఫెస్టివల్ వచ్చిందటే.. చుక్క, ముక్క ఉండాల్సిందే. తాగితేనే పండగ కిక్ గా చాలా మంది భావిస్తారు. 

3 /6

ప్రస్తుతం సంక్రాంతి వేళ మద్యం ఏరులై పారింది. మందుబాబులు ఈ మూడు రోజుల్లో ఏకంగా... రూ.400 కోట్ల విలువైన మద్యం తాగేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  అంతే కాకుండా.. ఇక చివరి రెండు రోజుల్లో అంటే.. సంక్రాంతి, కనుమ రోజున.. రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు మద్యం దుకాణ యజమానులు చెబుతున్నారు.   

4 /6

కనుమ రోజున చాలా మంది చనిపోయిన తమ పూర్వీకుల కోసం  మద్యం, మాంసంను తప్పకుండా తెచ్చుకుని వండుకుంటారు. ఈ క్రమంలో కనుమ రోజున మద్యం అమ్మకాలు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

5 /6

సంక్రాంతి పండుగకు ముందు.. భారీగా సరుకును తెచ్చుకుని దాచుకున్నారు. అయితే.. ఫెస్టివల్ తర్వాత చాలా షాపుల్లో మద్యం అమ్మకాలు ఖాళీ అయినట్లు తెలుస్తొంది. భారీగా పెరిగిన మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరినట్లు సమాచారం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదని.. ఏపీ ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. 

6 /6

పండగ నేపథ్యంలో ఏపీ సర్కారు లిక్కర్ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.  ఇక కోడి పందాలు వంటి చాలా చోట్ల లిక్కర్ అమ్మకాలు జరిపినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ప్రజలంతా.. తమ సొంతుళ్లకు వెళ్లి పొద్దస్తమానం మందు పార్టీలు చేసుకుంటూ.. సర్కారు ఖాజానాను నింపడమే టార్గెట్ గా పెట్టుకున్నారని  మరీ తాగినట్లున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు.