AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం.. కొణిదెల పవన్‌ కల్యాణ్‌ బయోగ్రఫీ ఇదే..!

konidela pawan kalyan biography: ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీపై అత్యధిక మెజారిటీతో గెలిచింది. మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్‌ 4న నేగు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈనేపథ్యంలో జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌ బయోగ్రఫీ తెలుసుకుందాం.
 

1 /6

పవన్‌ కల్యాణ్‌ 1971 సెప్టెంబర్‌ 2న బాపట్లలో జన్మించారు. తండ్రి  శ్రీ వేంకట రావు, తల్లి పేరు అంజనా దేవి. పవన్‌ ఇంటర్మీడియేట్‌ చదువుకున్నారు. ఆయన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ ఈయన 2013 ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించుకున్న సెలబ్రిటీ యాక్టర్‌.

2 /6

అంతేకాదు ఫిల్మ్‌ఫెయిర్‌, సైమా అవార్డు, సిని మా, సంతోషం ఫిల్మ్‌ అవార్డును కూడా పొందారు. ఈయన నందినిని 1997లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి విడాకులు అయ్యాయి.  

3 /6

పవన్‌ కల్యాణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి తమ్మడు. ఈయన 19961 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తెలుగు సినిమాతో అరంగేట్రం చేశారు. బద్రీ, జానీ సినిమా సమయంలో రేణు దేశాయ్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి అకీరా నందన్‌, ఆధ్యా అనే సంతానం ఉంది. అన్న లెజినెవాను 2013లో పెళ్లి చేసుకున్నారు.   

4 /6

జనసేన పార్టీని పవన్ కల్యాణ్‌ 2014లో స్థాపించారు. ఈయన ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఇది జనసేన పార్టీకి సంబంధించినది. పవన్‌ కల్యాణ్‌కు నరేంద్ర మోడీ వెన్నుదన్ను కూడా ఉంది. అయితే, తెలుగు దేశం పార్టీతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. పవన్ ఏ ర్యాలీ చేసినా అశేష జన సందోహంతో ఆయా ప్రాంతాలు నిండిపోయేవి.  

5 /6

2019 ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుంచి పోటీ చేసింది. అందులో ఆయన గాజువాక, భీమవరం రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. కానీ, రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. వైసీపీ గెలిచింది కానీ, ఆ పార్టీకి చెందిన రాజోల్‌ నియోజకవర్గం మాత్రం గెలిచింది.  

6 /6

2020లో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వైసీపీ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పోటీ చేశారు. రికార్డు స్థాయిలో కూటమి ఈ ఎన్నికల్లో గెలిచి సంభ్రమాశ్చర్యాలకు గురించేసింది.