Ap Heavy Rains Alert: ఏపీకు మళ్లీ రెడ్ అలర్ట్, మరో అల్పపీడనం భారీ వర్షాలు జాగ్రత్త

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఇంకా ఆ ముప్పు పూర్తిగా తొలగకముందే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రానున్న 5 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని...ఫలితంగా మరోసారి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈసారి భారీ వర్షాలకు గురయ్యే జిల్లాలివే...తస్మాత్ జాగ్రత్త

Ap Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఇంకా ఆ ముప్పు పూర్తిగా తొలగకముందే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రానున్న 5 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని...ఫలితంగా మరోసారి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈసారి భారీ వర్షాలకు గురయ్యే జిల్లాలివే...తస్మాత్ జాగ్రత్త
 

1 /5

బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి ఇవాళ తెల్లవారుజామున నెల్లూరు సమీపంలోని తడ వద్ద తీరం దాటింది. ఫలితంగా 3 రోజులుగా దక్షిణ కోస్తాంధ్రపై తీవ్రమైన ప్రభావం పడింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 

2 /5

ఇప్పుడీ ముప్పు పూర్తిగా తొలగకముందే వాతావరణ శాఖ నుంచి మరో అలర్ట్ జారీ అయింది. అక్టోబర్ 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. దాంతో అక్టోబర్ 18 అంటే రేపట్నించి అక్టోబర్ 21 వరకూ రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. రేపట్నించి ఏయే జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది చూద్దాం

3 /5

అక్టోబర్ 18వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండవచ్చు.

4 /5

అక్టోబర్ 19వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

5 /5

అక్టోబర్ 20, 21 తేదీల్లో కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, అనంతపురం, సత్యసాయి, కడప, కాకినాడ నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.