AP Liquor Policy: ఏపీ మద్య విధానంలో లాటరీ లక్కు కిక్కు..

AP Liquor Policy: ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుంచే లాటరీ ప్రక్రియ ప్రారంభం అయింది. కలెక్టర్లు, ఎక్సైజ్‌ అధికారులు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ  నిర్వహిస్తున్నారు.

1 /5

ఏపీలో మద్యం షాపులకు మొత్తం 89వేల 882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజులతో ప్రభుత్వానికి 1వేయి 797 కోట్ల ఆదాయం వచ్చింది.  

2 /5

ఎన్టీఆర్‌ జిల్లాలో 113 షాపులకు అత్యధికంగా 5వేల 825 దరఖాస్తులు వచ్చాయి. అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా  దరఖాస్తు చేసుకున్నారు.

3 /5

లాటరీ ద్వారా ఎన్నుకున్న వారికి మంగళవారం లిక్కర్  షాపులను అప్పగించనున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది.

4 /5

మొత్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామిని ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. మద్యం విధానం పూర్తిగా మార్చేసి తక్కువ ధరకే మందును అందుబాటులోకి తీసుకురాబోతుంది.

5 /5

ఏపీ కొత్త మద్యం విధానంలో లిక్కర్  ధరలను కూడా భారీగా తగ్గించి అతి తక్కువకే మద్యం అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా మద్యం ధరలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. మద్యం ధరల సవరణపై గెజిట్‌ విడుదల చేసింది.