Lokesh: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి.. నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. అమెరికాలో పర్యటిస్తున్నారు. 2024లొ ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు.
Lokesh: APలోకి పెట్టుబడు ఆక్షరణే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి లోకేష్. శాన్ ఫ్రాన్సిస్కో లో ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ ను అక్కడి మేయర్‌తో కలిసి ఆవిష్కరించారు. జెండా ఊపి నూతన వాహనాన్ని అమెరికా మార్కెట్ లోకి విడుదల చేశారు. ఏపీలో పురుడు పోసుకున్న బోసన్ మోటార్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు లోకేష్.
అనంతరం బోసన్ సంస్థ కార్యాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. APలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తామన్నారు.
మౌలిక సదుపాయాలతో కలిపి ఇస్తామన్నారు. ఇందుకుగాను సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు లోకేష్.
అంతేకాదు అమెరికా పర్యటనలో భాగంగా అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రులను కలిసే అవకాశాలున్నాయి. అంతేకాదు వారితో కలిసి ఏపీలో పెట్టుబడులపై చర్చించే అవకాశాలున్నాయి.
లోకేష్ .. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు. గత 2019 ఎన్నికల్లో ఓటమితో కృంగిపోకుండా.. ప్రజల్లోనే ఉండి.. గెలిచి చూపించారు. గతంలో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రి వర్గంలో లోకేష్ ఐటీ పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే కదా.