Nayanatara: విఘ్నేష్ కంటే ముందు అంతమందితో 'నయన్' ఎఫైర్ నడిపిందా..?

Nayanthara Love Stories : కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న కేరళ బ్యూటీ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటనతో, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు సౌత్ సూపర్ స్టార్ గా మారిపోయింది. ఇక తాజాగా డాక్యుమెంటరీ విడుదలకానున్న  నేపథ్యంలో ఈమెకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. 

1 /6

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈమె..  ఆ తర్వాత తన కాళ్లపై నిలబడి..నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

2 /6

ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టేటస్ ను  అందుకుంటూ సౌత్ సినీ ఇండస్ట్రీలో అధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. కెరియర్ పరంగానే కాదు వృత్తి పరంగా కూడా ఎన్నో సార్లు వార్తల్లో నిలిచింది నయనతార.   

3 /6

ఇకపోతే ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇతనితో ప్రేమలో పడకముందే మరో ఇద్దరితో ఈమె ఎఫైర్ నడిపింది అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈమె లవ్ ఎఫైర్ లిస్ట్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. 

4 /6

అసలు విషయంలోకెళితే.. సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె కెరియర్ స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్న సమయంలోనే 'వల్లవన్' అనే సినిమాలో నటించింది. శింబు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సమయంలోనే అతడితో ప్రేమలో పడిన ఈమె, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ కొద్ది రోజులకే అతడు ఇంకో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని, అందుకే అతడికి దూరమైందని సమాచారం. అంతేకాదు ఇకపై శింబు సినిమాలలో నటించనని నయనతార చెప్పినట్లు తెలిసింది.

5 /6

అలా కొన్నాళ్లపాటు సినీ ఇండస్ట్రీలో..  కెరియర్ పై దృష్టి పెట్టిన ఈమె,  ప్రభుదేవాతో కలిసి 'విల్లు' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభుదేవాతో ప్రేమలో పడింది.   

6 /6

అంతేకాదు తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేస్తూ.. 2010లో పెళ్లి చేసుకుంటున్నాం అంటూ ప్రభుదేవా వెల్లడించారు. దీంతో ఇండస్ట్రీకి దూరం అవ్వాలనుకున్న నయనతార,  క్రిస్టియన్ అయినప్పటికీ తన మతాన్ని హిందూమతంగా మార్చుకుంది. అదే సమయంలో ప్రభుదేవా భార్య ఎంట్రీ ఇవ్వడంతో నయనతార కాస్త దూరం జరిగింది. 2012లో తామిద్దరం విడిపోయామని చెప్పింది. ఇక తర్వాత 2021లో విఘ్నేష్ శివన్ తో నిశ్చితార్థం జరుపుకొని, 2022లో ఆయనను వివాహం చేసుకుంది.