Airtel 5G Services test: 5జీ టెస్ట్ సర్వీసును ప్రారంభించిన ఎయిర్‌టెల్, మీరు కూడా పొందవచ్చు ఇలా..

  • Feb 04, 2021, 19:39 PM IST

 

Airtel 5G Services test: ఎయిర్‌టెల్ ( Airtel ) ఇండియాలో 5జీ నెట్వర్క్ సర్వీసులు టెస్ట్ ( 5G Network test service ) చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ కొత్త మొబైల్ టెక్నాలజీ విషయంలో చాలా విషయాలు చర్చకొస్తున్నాయి. కానీ అన్నింటి కంటే కీలకవిషయమేమంటే..ఇప్పుడు ఎయిర్‌టెల్ స్వయంగా 5 జీ సర్వీసెస్‌ను టెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 5జీ సర్వీసెస్ ఎలా పొందాలనేది ఇప్పుడు మేం మీకు చెబుతాం.

1 /5

ఎయిర్‌టెల్ తన 5జీ సర్వీస్ డెమోన్స్ట్రేషన్ ( Airtel 5G Service Demonstration ) హైదరాబాద్‌లోని మాధవ్‌పూర్ ఎయిర్‌టెల్ స్టోర్‌ ( Madhavpur Airtel store ) లో నిర్వహించింది. యూజర్లు అక్కడికి వెళ్లి..ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

2 /5

ఎయిర్‌టెల్ 5జి సర్వీస్ 1800 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌ ( 1800 MHZ Band ) పై లైవ్ ఇచ్చింది. ఇది ఎన్ఎస్ఏ ( NSA ) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. కంపెనీ తన 5 జీ సర్వీస్‌ ను డైనమిక్ నెట్వర్క్ స్పెక్ట్రమ్ షేరింగ్ టెక్నిక్‌తో టెస్ట్ చేసింది. 

3 /5

ఎయిర్‌టెల్ 5జీ ( Airtel 5G Service ) సర్వీస్‌లో 3 జీబీపీఎస్ ( 3GBPS ) వరకూ డౌన్‌లోడింగ్ స్పీడ్ లభిస్తుంది. కంపెనీ తన 5జీ సర్వీస్ స్పెక్ట్రమ్ ఎలాట్‌మెంట్ అయిన వెంటనే ప్రారంభిస్తుంది. ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్ రేడియో, కోర్, ట్రాన్స్‌పోర్ట్ అన్ని డొమైన్లకు వర్తిస్తుంది. 5జీ సర్వీస్ వీడియోను కూడా యూట్యూబ్‌ ( Youtube ) లో అందుబాటులో ఉంచింది.

4 /5

కంపెనీ సీఈవో, ఎండీ గోపాల్ బిఠ్టల్ ..ఎయిర్‌టెల్ 5జీ ( Airtel 5G Network ) రెడీ నెట్వర్క్ గురించి ప్రకటించారు. ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్ హైదరాబాద్‌లో కమర్షియల్ లైవ్ నిర్వహించారు. స్పెక్ట్రమ్ ఎలాట్‌మెంట్‌ ( Spectrum Allotment ) తోనే ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్ ప్రారంభించగలమని కంపెనీ ప్రకటించింది.

5 /5

కంపెనీ 5జీ సర్వీస్..4జీ తో పోలిస్తే పదిరెట్లు ( 10 Times speed ) ఎక్కువ వేగంగా ఉంది. కంపెనీ ఈ సేవల్ని హైదరాబాద్‌లో పరీక్షించింది. ఒక ఫుల్ మూవీను కేవలం సెకన్ల వ్యవధిలో 5 జీ నెట్వర్క్ ద్వారా డౌన్‌లోడ్ ( Download ) చేసుకోవచ్చు