Kiara Advani Pics: తెల్ల చీరలో.. మల్లెపువ్వులా మెరిసిపోతున్న కియారా అద్వానీ!

Kiara Advani Latest White Saree Images goes viral. సోషల్‌ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కియారా అద్వానీ.. తాజాగా తెల్ల చీరలో తళుక్కుమన్నారు. తెల్ల చీరలో కియారా మల్లెపువ్వులా మెరిసిపోతున్నారు. 
 

  • Jun 15, 2022, 20:41 PM IST
1 /6

సోషల్‌ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కియారా అద్వానీ.. ఎప్పటికప్పుడు తన సినిమాల విషయాలతో పాటు తన అందమైన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలోనే తెల్ల చీరలో.. మల్లెపువ్వులా మెరిసిపోతున్నారు.   

2 /6

డేటింగ్ రూమర్లతో కూడా కియారా పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. షేర్షా స్టార్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ జంటకు బ్రేకప్ అయిందని కూడా నెట్టింట వార్తలు షికార్లు చేశాయి.   

3 /6

ప్రస్తుతం కియారా అద్వానీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. భూల్‌ భులైయ్యా 2, జగ్‌ జుగ్‌ జీయో, గోవిందా నామ్‌ మేరా సినిమాల్లో నటిస్తున్నారు.   

4 /6

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'భరత్ అను నేను సీనియాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కియారా. ఆపై రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ సినిమాలో నటించారు.   

5 /6

'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ కియారా అద్వానీకి మరింత పేరు తీసుకొచ్చింది. అందులో కియారా బోల్డ్ యాక్టింగ్‌కు అందరు ఫిదా అయ్యారు.   

6 /6

2014లో వచ్చిన 'ఫగ్లీ' సినిమాతో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంతో పాపులర్ అయ్యారు.