8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. బడ్జెట్‌లో ఊహించని జాక్‌పాట్..?

8th Pay Commission Latest News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి చేరడంతో తదుపరి పెంపు ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ ఏడాదికి సంబంధించిన రెండో డీఏ పెంపు ప్రకటన ఉండనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
 

1 /8

8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. బేసిక్ పే, అలవెన్సులు, పెన్షన్, ఇతర ప్రయోజనాలలో కూడా పెంపు ఉంటుంది.   

2 /8

ఈ నెల 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కేబినెట్ సెక్రటరీకి ప్రతిపాదనలు పంపించింది.  

3 /8

8వ వేతన కమిషన్‌ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మోదీ 3.O ప్రభుత్వంలో ప్రకటన ఉంటుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.  

4 /8

8వ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.   

5 /8

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త పే కమిషన్ ఏర్పాటు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత జీతాల నిర్మాణం, అలవెన్సులు, ప్రయోజనాలను బేరీజు వేసుకుని.. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన మార్పులను కొత్త పే కమిషన్ సిఫారసు చేస్తుంది.  

6 /8

ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం 2014లో నోటిఫై చేయగా.. 2016లో అమల్లోకి వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 28 ఫిబ్రవరి 2014న 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిఫార్సులు 1 జనవరి 2016 నుంచి అమలులోకి వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటైతే.. మోదీ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లవుతుంది.  

7 /8

ఈ ఏడాది మార్చిలో 4 శాతం డీఏ పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. రెండో డీఏ కూడా 4 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

8 /8

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.