7th Pay Commission Latest Updates: న్యూ ఇయర్‌కు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గుజరాత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 9 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి చేకూరుతుంది. జూలై నుంచి నవంబర్ వరకు బకాయిలు డిసెంబర్ జీతంతో చెల్లించనున్నారు. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి.
మూలవేతనంలో 3 శాతం మేర జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 50 నుంచి 53 శాతానికి చేరింది.
రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీ ఉద్యోగులు, సెకండరీ, హయ్యర్ సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఏడో వేతన సంఘం కింద ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల ఉద్యోగులకు జీతాల పెంపు వర్తించనుంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏ పెంచనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది జనవరిలో డీఏ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఎంత శాతం పెంచుతుందో వెల్లడించలేదు.
జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులకు 20 శాతం డీఏ పెరిగింది. దీంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొత్త ఏడాదిలో వరుసగా శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర బడ్జెట్ 2025లో కొత్త పే కమిషన్ ప్రకటన ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా డీఏ పెంపు ప్రకటన కూడా ఉండనుంది.
దీపావళి గిఫ్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. మరోసారి 3 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.