7th Pay Commission: రేపే మోదీ 3.O బడ్జెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు..!

7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరిపై వరాలు జల్లు కురిపిస్తారు..? బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మోదీ 3.O బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు.
 

1 /7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చిలో ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెరిగింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరగా.. జనవరి 1వ తేదీ నుంచి కేంద్రం అమలు చేసింది.  

2 /7

రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మరోసారి 4 శాతం పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మొత్తం డీఏ 54 శాతానికి చేరుతుంది.  

3 /7

అయితే కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.  

4 /7

కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉండగా.. 3.68 రెట్లు పెంచాలనే డిమాండ్ ఉంది.  

5 /7

8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. బేసిక్ పే రూ.26     వేలకు పెరిగే ఛాన్స్ ఉంది. కొత్త పే కమిషన్ ఇప్పుడు ఏర్పాటు చేసినా.. సిఫార్సులు 2026 నుంచి అమలులోకి రానున్నాయి.  

6 /7

జేసీఎం కార్యదర్శి శివగోపాల్ మిశ్రా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.  

7 /7

8వ వేతన సంఘం ఏర్పాటైతే.. డియర్‌నెస్ అలవెన్స్ (డీఎ), ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీఎ) వంటి వివిధ ప్రయోజనాలు, అలవెన్సులు కూడా భారీగా పెరుగుతాయి.