సౌదీలో రోడ్డున పడ్డ తెలుగు కార్మికులు

Last Updated : Sep 11, 2017, 01:56 PM IST
సౌదీలో రోడ్డున పడ్డ తెలుగు కార్మికులు

పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన భారతీయ కార్మికులు రోడ్డున పడ్డారు. వేల మంది ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో తెలుగు కార్మికులు 80 వేల మంది ఉన్నట్లు సమాచారం. సౌదీ దేశ చట్టాల ప్రకారం కంపెనీలన్నీ విదేశీ కార్మికుల భారీ తగ్గించుకున్నాయి. ఈ పక్రియలో భాగంగా 14 శాతం విదేశీ ఉద్యోగులకు తొలగించారు. మరోవైపు ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎలాగో అలా స్వదేశాలకు చేరుకుందామనుకుంటే ..కంపెనీ యాజమాన్యాలు పాస్ పోర్టులు, వీసాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు విదేశీ కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇబ్బందులను బంధువులకు ఫోన్లలో చెప్పుకొని మదన పడుతున్నారు. బాధిత కుటుంబాలు తమ వారిని  ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు  చేస్తున్నారు.

Trending News