న్యూజిల్యాండ్‌లో ఇళ్లు కొనుకోలుపై నిషేదం

Last Updated : Oct 31, 2017, 05:09 PM IST
న్యూజిల్యాండ్‌లో ఇళ్లు కొనుకోలుపై నిషేదం

న్యూజిల్యాండ్‌ ప్రధాని  ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్‌  సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులు తమ దేశంలో ఇళ్లు కొనుగోలు చేయడంపై నిషేధం విధించారు. తాజా నిర్ణయం 2018 నుంచి ఈ నిషేదం అమల్లోకి రానుంది. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్లకు మాత్రం వర్తించదు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఆసీస్ మినహా ఇతరు దేశస్తులు ఇళ్లను కొనగోలు చేయడానికి వీల్లేదు. 

న్యూజీల్యాండ్‌ ప్రధాని  ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్‌ ఈ అంశంపై స్పందిస్తూ  ‘న్యూజిలాండ్‌ దేశస్థులకు ఇళ్లు కొనుగోలు చేయడాన్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విదేశీయులు ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల దాదాపు 50శాతం ధరలు పెరిగాయన్నారు. భూముల ధరలు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతోందని కేంద్ర బ్యాంక్ ఇచ్చిన నివేదిక పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిషేధానికి సంబంధించిన బిల్లును న్యూజిలాండ్‌ పార్లమెంటులో డిసెంబరు 25న ప్రవేశపెట్టనున్నట్లు అర్డెర్న్‌ వెల్లడించారు.

ప్రవావ భారతీయుల్లో ఆందోళన..
ఉద్యోగ, బిజినెస్, ఉద్యోగ రీత్యా వెళ్లి న్యూజీలాండ్ స్థిరపడిన వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు.  తాజా నిర్ణయం వీరికి ఇబ్బందిగా పరిగణించనుంది. న్యూజిల్యాండ్ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని పున: పరిశీలించాలని ఆ దేశంలో స్థిరపడిన ప్రభాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.

Trending News