MLC Kavitha In ATA : అమెరికాలోని తెలుగు ప్రజలు భారత్‌కే గర్వకారణం-ఎమ్మెల్సీ కవిత

MLC KAVITHA IN ATA : అమెరికా వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఆటా 17 వ మహాసభల్లో పాల్గొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అక్కడ ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఆటా అంటే ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్‌ అని అభివర్ణించారు.

Written by - Pradeep | Last Updated : Jul 3, 2022, 01:42 PM IST
  • ఆటా మహాసభల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
  • తెలంగాణ పెవిలియన్ ప్రారంభం
  • తెలుగు ప్రజలు భారత్‌కే గర్వకారణమన్న కవిత
MLC Kavitha In ATA : అమెరికాలోని తెలుగు ప్రజలు భారత్‌కే గర్వకారణం-ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha In ATA : అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17 వ మహాసభలు వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా జరిగాయి. ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుచేయడం గర్వకారణమన్నారు. దీనిద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అమెరికాలో ఉన్న తెలుగువారికి తెలుస్తాయన్నారు. ప్రతి మహాసభలోనూ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుచేయాలని ఆటా ప్రతినిధులను కోరారు ఎమ్మెల్సీ కవిత.

ఆటాకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఆటా అంటే ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్ గా అభివర్ణించారు. ఒకప్పుడు భారతదేశంలో తెలుగువారికి ఎన్టీరామారావు గుర్తింపుతెచ్చారని... ఇప్పుడు తెలంగాణ వారికి దేశంలో కేసీఆర్ గుర్తింపుతెచ్చారన్నారు. అదేవిధంగా అమెరికాలో తెలుగువారికి ఆటా గుర్తింపు తెచ్చిందన్నారు.  మహాసభల ద్వారా తెలుగు సంస్కృతిని భావితరాలకు తెలియజేస్తున్న ఆటా కృషిని అభినందించారు. భారతదేశం గర్వించేదగ్గ స్థాయికి అమెరికాలోని తెలుగువారు ఎదిగారన్నారు.

తానా, ఆటాలకు అమెరికాలోని ఏదైనా ఒక నగరంలో హెడ్‌క్వార్టర్‌ ఏర్పాటుచేసి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఓ మ్యూజియం ఏర్పాటుచేయాలని కవిత సూచించారు. మాల్దీవులు, మారిషస్‌లో ఉన్న తెలుగువాళ్లు.. తెలుగుభాష, సంస్కృతిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు తెలుగు యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆటాకు కూడా రాష్ట్రప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందన్నారు. 

ఈ సందర్భంగా రచయిత ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో ఆటా వ్యవస్థాపక సభ్యుడు హన్మంత్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ , తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఎన్నారైలు పాల్గొన్నారు.

Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!

Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News