KTR Meets Britain Trade Minister: బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్థనతో సమావేశమయ్యారు. లండన్‌లోని రనిల్ జయవర్థన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలు, పరిశ్రమలకు తెలంగాణ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యత, రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి కేటీఆర్ ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సు గురించి వివరించిన మంత్రి కేటీఆర్.. రనిల్ జయవర్థనను ఆ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానించారు. తెలంగాణలో అమలు అవుతున్న టీఎస్ ఐపాస్ విధానం (TS IPASS) గురించి తెలుసుకున్న బ్రిటన్ మంత్రి జయవర్థన.. ప్రశంసలు కురిపించారు.
Also read : Minister KTR In London: లండన్‌లో బిజీ బిజీగా కేటీఆర్..!!
Also read : Swati Dhingra News: ఎన్నారై స్వాతి ధింగ్రాకు ఇంగ్లాండ్‌లో అరుదైన పదవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.