Simon Harris: ప్రపంచ దేశాల్లో భారత సంతతి వ్యక్తులు సత్తా చాటుతున్నారు. తాజాగా ఐర్లాండ్ దేశానికి భారత సంతతి వ్యక్తి సైమన్ హారిస్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. లియో వరద్కర్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో యువకుడైన సైమన్ హారిస్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు. సైమన్ హారిస్ ఎన్నిక మరో రికార్డును కూడా సాధించింది. ఆ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా హారిస్ ఘనత సాధించారు.
Also Read: Legal Notice: మీడియా సంస్థలకు కేటీఆర్ భారీ షాక్.. బామ్మర్దితో ఛానల్స్‌కు రూ.160 కోట్ల నోటీసులు
ప్రధానమంత్రిగా ఉన్న లియో వరద్కర్ బుధవారం (మార్చి 20వ తేదీ) అనూహ్యంగా రాజీనామా చేశారు. రాజీనామాతో ఐర్లాండ్‌లో సంక్షోభం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వం ఉన్న ఆ దేశంలో తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో అనూహ్యంగా హారిస్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో వివిధ శాఖల మంత్రిగా చేసిన హారిస్ సేవలను గుర్తించిన సంకీర్ణ ప్రభుత్వంలోని పక్షాలు తదుపరి ప్రధానిగా నియమించేందుకు అంగీకరించాయి.
ఈక్రమంలోనే ఫైన్ గేల్ పార్టీ హారిస్‌ను ప్రధానిగా నియమించింది. అన్ని పార్టీలతో చర్చలు జరిపిన అనంతరం హారిస్‌ను ప్రధానమంత్రిగా ప్రకటించింది. ప్రధానిగా ఎన్నికవడంపై సైమన్ హారిస్ స్పందించారు. 'నా జీవితంలో నాకు లభించిన గొప్ప గౌరవం. నన్ను ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తా' అని హారిస్ తెలిపాడు.
Also Read: KT Rama Rao: యూట్యూబ్ ఛానళ్లపై కేటీఆర్ యుద్ధం.. ఇక ఆయా ఛానళ్ల వారికి చుక్కలే
భారత సంతతికి చెందిన సైమన్ హారిస్ వయసు 37 ఏళ్లు. చిన్న వయసు నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న ఫైన్ గేల్ పార్టీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. ఐర్లాండ్‌లో 2016 నుంచి 2020 ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకమైన సేవలు అందించారు. అనంతరం ఉన్నత విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హారిస్ ఇప్పుడు అనూహ్యంగా దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook