Hyderabad Girl Bitter Experience in Philippenes: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి ఫిలిప్పీన్స్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న ఆ యువతి లాక్డౌన్ సమయంలో ఇండియా వచ్చేసింది. ఇటీవల తిరిగి ఫిలిప్పీన్స్ వెళ్లగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో ఆమె ఉంటున్న ఇంటి యజమాని.. అద్దె చెల్లించలేదని యువతిపై ఫిర్యాదు చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అనుమతించలేదు. దీంతో చేసేది లేక ఆ యువతి తిరిగి ఇండియా వచ్చేసింది.
హైదరాబాద్‌లోని వనస్థలిపురంకి చెందిన నవ్య దీప్తి అనే యువతికి ఈ అనుభవం ఎదురైంది. నవ్య దీప్తి లాక్ డౌన్ సమయంలో ఇండియాకి వచ్చేసింది. అప్పటినుంచి ఆన్లైన్లో క్లాసులకు హాజరవుతోంది. ఇటీవల ప్రత్యక్ష బోధన ప్రారంభం కావడంతో తిరిగి ఫిలిప్పీన్స్ బయలుదేరింది. కానీ విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో షాకైంది. నవ్య దీప్తి ఉండే ఇంటి యజమానురాలు ఆమెపై ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమె పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని.. ఫిలిప్పీన్స్‌లో ఆమెకు అనుమతి లేదని చెప్పారు.
నవ్య దీప్తి ఫిలిప్పీన్స్‌లోని భారత ఎంబసీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యపడకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఇండియా తిరిగొచ్చేశారు. ఫిలిప్పీన్స్‌లో తాను నివాసం ఉంటున్న ఇంటికీ లాక్‌డౌన్‌లోనూ అద్దె చెల్లించానని నవ్య దీప్తి తెలిపారు. కానీ తన ఇంటి యజమానురాలు మరో రూ.40 వేలు ఇవ్వాల్సిందిగా తనను బెదిరించిందన్నారు. ఆమె కోరినట్లే ఆ డబ్బు కూడా చెల్లించానని... అయినప్పటికీ తనపై అధికారులకు ఫిర్యాదు చేయడం షాక్‌కి గురిచేసిందని వాపోయారు.
Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook