Apple iPhone 15 Pro models have solid state buttons: ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ సంస్థ 'ఐఫోన్ 15' సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ లాంచింగ్‌కి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఐఫోన్ 15 సిరీస్‌కు సంబందించిన లీకులు, రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ డిజైన్, ధర గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. యాపిల్ యొక్క ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు సాలిడ్-స్టేట్ బటన్లకు బదులుగా భౌతిక బటన్లను కలిగి ఉండవచ్చవని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
యాపిల్ విశ్లేషకుడు మింగ్ చి-కువో ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్ ఉత్పత్తికి ముందు పరిష్కరించని సాంకేతిక సమస్యల కారణంగా ఐఫోన్ 15 ప్రో మోడల్ సాంప్రదాయ భౌతిక బటన్ డిజైన్‌ను కలిగి ఉంటుందట. ఉత్పత్తికి ముందు పరిష్కరించని సాంకేతిక సమస్యల కారణంగా.. హై-ఎండ్ ఐఫోన్ 15 ప్రో మోడల్స్ (ప్రో మరియు ప్రో మాక్స్) రెండూ నిశితంగా పరిశీలించబడతాయని మింగ్ చి-కువో తెలిపారు. పై విధంగా బుధవారం ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.
సాలిడ్-స్టేట్ బటన్ల (వాల్యూమ్ బటన్, పవర్ బటన్) కోసం టాక్టిక్ ఇంజన్ సరఫరాదారు అయిన Luxshare ICT, AAC టెక్నాలజీస్ కంటే చాలా పెద్ద ఆపరేటింగ్ స్కేల్ కారణంగా తక్కువ ప్రభావం చూపుతుంది. ఐఫోన్ 15 ప్రో ఇప్పటికీ EVT డెవలప్మెంట్ దశలోనే ఉందని, కాబట్టి డిజైన్‌ను సవరించడానికి ఇంకా సమయం ఉందని మింగ్ చి-కువో చెప్పారు.
అదనంగా సాలిడ్-స్టేట్ బటన్లను తీసివేయడం, భౌతిక బటన్ల పునఃస్థాపన అభివృద్ధి మరియు పరీక్ష ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ పరిశీలనల ఆధారంగా సాలిడ్-స్టేట్ బటన్ని తీసివేయడం ఐఫోన్ 15 ప్రో మోడల్ యొక్క భారీ ఉత్పత్తి మరియు షిప్మెంట్లపై స్వల్ప ప్రభావాన్ని చూపుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.