2023's First Lunar Eclipse: ఈ ఏడాది అంటే 2023లో తొలి చంద్ర గ్రహణం మే 5వ తేదీన ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణం కొన్నిరాశులకు అత్యంత శుభదాయకంగా ఉండనుంది. ఈ రాశుల జీవితంలో చంద్ర గ్రహణం ముగిసినప్పటి నుంచి గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయని చెప్పవచ్చు.
సూర్య, చంద్ర గ్రహణాలు సాధారణంగా జరిగే ఖగోళ ఘటనలు. కానీ హిందూ జ్యోతిష్యశాస్త్రం కూడా గ్రహణాల్ని అత్యంత మహత్వపూర్వకంగా పరిగణిస్తుంది. వేర్వేరు సమయాల్లో సంభవించే సూర్య,చంద్ర గ్రహణాల ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. 2023 తొలి చంద్ర గ్రహణం మే 5వ తేదీ రాత్రి 8 గంటల 44 నిమిషాలకు ఏర్పడనుంది. ఇది రాత్రి 1 గంట వరకూ ఉంటుంది. 4 గంటల కంటే ఎక్కువసేపు ఉండే చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించదు. కానీ ఈ గ్రహణం శుభ, అశుభ ప్రభావం అందరి జీవితాలపై పడుతుంటుంది. ముఖ్యంగా 3 రాశులకు అత్యంత శుభం కలగజేయనుంది.
సింహ రాశి:
ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ప్రభావం సింహరాశి జాతకులకు లాభాన్ని కలగజేయనుంది. సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సమయంలో సూర్యుడి ప్రభావం పెరుగుతుంది. దాంతో శుభం కలగనుంది. మీకు సంబంధించిన పెండింగు పనులు పూర్తవుతాయి. ఏదైనా కీలకమైన పనిలో విజయం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ కోర్కెలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది.
Also Read: Tijori Vastu Tips: గురువారం ఈ వస్తువులను రహస్యంగా బీరువాలో పెట్టండి.. రాత్రిపూట అద్భుతాలు జరుగుతాయి!
మకర రాశి:
మకర రాశి జాతకులకు చంద్ర గ్రహణం లాభాన్ని కల్గించనుంది. ఈ జాతకం కెరీర్లో పదోన్నతి లేదా ఉన్నత స్థానం లభిస్తుంది. పదోన్నతి కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నవారికి కోరిక నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. హఠాత్తుగా భారీఎత్తున డబ్బు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఇళ్లు, వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభం కలుగుతుంది. వ్యాపారం పెరుగుతుంది. మే 5 తరువాత ప్రారంభించే కొత్తపనిలో లాభాలుంటాయి.
మేష రాశి:
మేష రాశి జాతకులకు చంద్ర గ్రహణం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. చంద్ర గ్రహణం సమయంలో చంద్రుని శక్తి తగ్గి సూర్యుడి శక్తి పెరుగుతుంది. ఈ ప్రభావం మేషరాశిపై ఫోకస్ పెంచుతుంది. మేషరాశి జాతకుల పనితీరు మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానం ఉంటుంది. వ్యాపారం విస్తృతమౌతుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపారం పెరిగి లాభాలు ఆర్జిస్తారు.
Also Read: Hanuman Jayanti 2023: ఈ రోజే హనుమాన్ జయంతి.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook